- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫుట్ పాత్ పై డ్రైవ్ చేశాడు..కానీ నేరుగా కారుకే ఢీ కొట్టి
ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు ఓ వాహనదారుడు ప్రయత్నించి, నేరుగా కారుని ఢీకొట్టేశాడు. ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు క్రమ క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠినమైన రూల్స్ అమలు చేసిన కూడా, యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక ఈ ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం. అయితే లేటెస్ట్ గా ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు ఓ టూ-వీలర్ వాహనదారుడు ప్రయత్నించి, నేరుగా కారుని ఢీకొట్టేశాడు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
బెంగుళూరులో నిత్యం ట్రాఫిక్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మన హైదరాబాద్ తరహాలోనే బెంగళూరులో రద్దీ ఎక్కువ. ఈ నేపథ్యంలో టూ-వీలర్ వాహనదారులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఇష్టం వచ్చినట్లు డ్రైవింగ్ చేస్తారు. ఫుట్ పాత్ పైన కూడా డ్రైవింగ్ చేసి ఎస్కేప్ అవుతుంటారు. అచ్చం అలాగే ట్రాఫిక్ సిగ్నల్ పడ్డ చోట వీడియోలో కల్పించిన ఈ వాహనదారుడు, ఫుట్ పాత్ పైన వెళ్లే ప్రయత్నం చేశాడు. అయితే బైక్ అదుపు తప్పడంతో నేరుగా కారును ఢీ కొట్టాడు. దీంతో ఆ కారు యజమాని, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. డబ్బులు కూడా వసూలు చేశాడు. ఈ ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఫుట్ పాత్ పైన బైక్ నడిపే వాళ్లకు కచ్చితంగా ఫైన్ వేయాలని డిమాండ్ చేస్తున్నారు.






