- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రా.. వచ్చి బైక్ పై కూర్చో.. ఆటోలో అమ్మాయికి యువకుడి వేధింపులు.. రియాక్షన్ వైరల్
ఆటో వెనుక భాగంలో కూర్చున్న యువతిని యువకుడు వేధించిన ఘటన బిహార్ లో వెలుగుచూసింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: అమ్మాయిలను ఏడిపించే యువకులకు పోలీసులు, షీ టీమ్స్ ఎన్నిసార్లు, ఎన్నిరకాలుగా బుద్ధి చెప్పినా వాళ్లలో మార్పు రావట్లేదు. తాజాగా ఆటోలో కూర్చున్న ఓ అమ్మాయిని యువకుడు వేధించాడంటూ నెట్టింట ఓ వీడియో వైరల్ అవుతోంది. పట్టపగలు నడిరోడ్డుపై బైక్ పై వచ్చి ఓ ఆటో పక్కన ఆగిన యువకుడు.. ఆటో వెనుక కూర్చుకున్న యువతిని పిలిచి.. వచ్చి నా బైక్ పై కూర్చో అని వేధించాడు. అందుకు ఆ యువతి ఘాటైన సమాధానం ఇచ్చింది. చేతులు చూపిస్తూ చెంప పగులుతుందని బదులిచ్చింది. యువకుడి బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం. బిహార్లోని గోపాల్ గంజ్ ప్రాంతానికి చెందినవాడుగా తెలుస్తోంది. ఈ ఘటనను అక్కడునున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.
ఇలాంటివారిపై పోలీస్ అధికారులు వెంటనే కఠినమైన, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వీళ్లను చూసీ చూడనట్లు వదిలేస్తే.. నిశ్శబ్దం నేరస్తుల్ని రక్షిస్తున్నట్లేనని కామెంట్స్ చేస్తున్నారు. మహిళలకు, ఆడపిల్లలకు పట్టపగలే రక్షణ లేకపోతే.. మళ్లీ వారంతా ఇళ్లకే పరిమితమయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. కాగా.. కొందరు నెటిజన్లు ఆమె అతని గర్ల్ ఫ్రెండ్ అని, గొడవ అవ్వడంతో తనతో బండిపై రావాలని బ్రతిమిలాడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో నిజమేంటనేది తెలియాల్సి ఉంది.






