- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్
ఇటీవల కర్ణాటక(Karnataka)లో సంచలనం రేపిన భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల కర్ణాటక(Karnataka)లో సంచలనం రేపిన భర్తను నదిలోకి తోసేసిన భార్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. కృష్ణా నది వద్ద సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి భర్త తాతప్పను భార్య నదిలోకి తోసేయగా.. స్థానికుల సహాయంతో తాతప్ప ప్రాణాలతో బయట పడ్డాడు. ప్రస్తుతం ఈ ఘటనలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. తనను చంపాలని చూసిందని ఆ భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఘటనపై విచారించిన పోలీసులు తిరిగి తాతప్పపైనే పోక్సో కేసు(POCSO Case) నమోదు చేశారు.
ఆ యువతికి 16 ఏళ్లు కూడా నిండక ముందే తాతప్ప పెళ్లి చేసుకున్నాడని గుర్తించిన బాలల హక్కుల కమిషన్, అతనిపై పోక్సో కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తన భర్తే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని, తాను తోసేయలేదని పోలీసులకు తెలిపింది సదరు యువతి.






