- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: వీధిరౌడీలా రెచ్చిపోయిన ట్రాఫిక్ కానిస్టేబుల్..! సస్పెండ్ చేసిన అధికారులు.. వీడియో వైరల్
బెంగళూరులో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీధిరౌడీలా ప్రవర్తించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగళూరులో (Bengaluru traffic constable) ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ వీధిరౌడీలా ప్రవర్తించిన ఘటన నెట్టింట వైరల్‌గా మారింది. రొటీన్ చెక్‌లో భాగంగా ఓ బైకర్‌ను ఆపిన ఆ కానిస్టేబుల్, అతడు తన పత్రాలు చూపించినప్పటికీ, అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపణలు వచ్చాయి. (Viral video) వైరల్ వీడియో ప్రకారం.. బెంగళూరులో ఓ బైకర్‌ను ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ బైకర్‌పై రెండుసార్లు చెయ్యి చేసుకున్నాడు. అతను కొన్ని పత్రాలు చూపించే ప్రయత్నం చేస్తాడు. కానీ పోలీస్ మాత్రం అతనిపై దురుసుగా ప్రవర్తించాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఇలాంటి ప్రవర్తనతో ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి, ప్రజల సేవకులుగా ఉండాల్సిన వారు వీధిరౌడీలా రెచ్చిపోయి చేయి చేసుకోవడం సిగ్గుచేటు అని నెటిజన్‌లు కామెంట్లు చేశారు. బైకర్ వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోతే బైక్ స్వాధీనం చేసుకోవాలి.. కానీ ఇలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్‌లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. వెంటనే స్పందించిన వారు, ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ విచారణకు ఆదేశించారు. వైరల్ వీడియో ఇదే..






