- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చీరలు దొంగలించిందని తెలుగు మహిళను రోడ్డుపైకి ఈడ్చుకెళ్లి !
కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన సంఘటన జరిగింది. దొంగతనం చేసిన నేపథ్యంలో తెలుగు మహిళను అత్యంత దారుణంగా కొట్టారు

దిశ, వెబ్ డెస్క్ : కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణమైన సంఘటన జరిగింది. దొంగతనం చేసిన నేపథ్యంలో తెలుగు మహిళను అత్యంత దారుణంగా కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. చీరలు దొంగిలించిందని తెలుగు మహిళను రోడ్డుపైకి ఈడ్చుకెళ్ళి దారుణంగా కొట్టాడు దుకాణదారుడు. బెంగళూరులోని అవెన్యూ రోడ్డులో మియా సిల్క్ సారీ దుకాణం ఉంది. పండుగ దగ్గరికి వస్తున్న నేపథ్యంలో ఆ దుకాణంలో... హడావిడి వాతావరణం నెలకొంది.
కస్టమర్లు విపరీతంగా వస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే దాదాపు 91 వేల 500 రూపాయల విలువైన చీరల కట్టను తెలుగు మహిళా దొంగిలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని వెంటనే సీసీటీవీ ఫుటేజ్ లో... దుకాణపు సిబ్బంది గుర్తించింది. దొంగిలించిన మరుసటి రోజు ఆ మహిళ అటువైపు వెళుతుండగా ఆ దుకాణపు సిబ్బంది చూశారు. దీంతో వెంటనే మియా సిల్క్ సారీ దుకాణం ఓనర్... ఆమెపై దాడి చేశాడు. దారుణంగా కొట్టాడు. అయితే.. ఈ సంఘటన వైరల్ కావడంతో రంగంలోకి పోలీసులు దిగారు. దీనిపై విచారణ చేస్తున్నారు. క్లిక్






