- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీర్ యోగా అంటూ.. లేడీ యాంకర్ వెకిలి చేష్టలు.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..(వీడియో)
ఇండియా ప్రపంచానికి అందిస్తున్న అద్భుతమైన బహుమతి యోగా. ప్రపంచ దేశాలు కూడా యోగా.. ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుందని గుర్తించాయి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇవ్వడంలో యోగా పాత్రపై ప్రశంసలు కురిపించాయి.

దిశ, వెబ్‌సైట్ : ఇండియా ప్రపంచానికి అందిస్తున్న అద్భుతమైన బహుమతి యోగా. ప్రపంచ దేశాలు కూడా యోగా.. ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుందని గుర్తించాయి. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని ఇవ్వడంలో యోగా పాత్రపై ప్రశంసలు కురిపించాయి. కానీ మన ఇండియన్స్ మాత్రం యోగాపై సెటైర్స్ వేయడంలో ముందున్నారు. ముఖ్యంగా కర్లీటేల్స్ యాంకర్ ఈ పనిలో బిజీగా ఉంది. బీర్ యోగా అంటూ పిచ్చి పిచ్చి వీడియోలు షేర్ చేస్తుంది.
బీర్ యోగా అంటే.. యోగా చేస్తూ బీర్ తాగడం. లండన్, జర్మనీ, ఆస్ట్రేలియా తర్వాత ఇండియాకు తీసుకొచ్చింది ఈమె అనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాక్టీస్ స్ట్రెస్‌ను తగ్గించి రిలాక్స్ పెంచుతుందని.. హ్యాపీగా ఉంచుతుందని చెప్తున్నారు ఫాలోవర్స్. యోగా రొటీన్ ఫాలో అయ్యేటప్పుడు చిల్డ్ బీర్ సిప్ చేయాలని.. ఆసనాల మాదిరిగా బీర్ బ్యాలెన్స్ చేయాలని సూచిస్తున్నారు. తప్పకుండా ఇంట్లో ట్రై చేయమని వీడియోలు వైరల్ చేస్తున్నారు. అయితే ఈ వీడియో గతంలోదని.. ప్రస్తుతం ఈ యాంకర్ స్పిరిచ్యువల్ యోగాను నమ్ముతుందని తెలుస్తోంది. కానీ ట్రోలర్స్.. ట్రోలింగ్ మాత్రం ఆపట్లేదు.






