బప్పా వచ్చేస్తున్నాడు.. ఏఐ వీడియో అదిరిపోయింది.. మీరూ చూసేయండి!

by Yella Dhawani Reddy |

వినాయక నవరాత్రి ఉత్సవాలకు సమయం సమీపిస్తుంది. దేశవ్యాప్తంగా ఓ వైపు గణపతి విగ్రహాలు

బప్పా వచ్చేస్తున్నాడు.. ఏఐ వీడియో అదిరిపోయింది.. మీరూ చూసేయండి!
X

దిశ, వెబ్ డెస్క్: వినాయక నవరాత్రి ఉత్సవాలకు సమయం సమీపిస్తుంది. దేశవ్యాప్తంగా ఓ వైపు గణపతి విగ్రహాలు (Ganesha idols).. మరోవైపు మండపాలను అందంగా అలంకరిస్తున్నారు నిర్వాహకులు. ఇది బాహ్య ప్రపంచంలోని సంగతి.. కానీ, ప్రస్తుతం మనం ఏఐ యుగంలో పయనిస్తున్నాం. మరీ బయటే కాకుండా సోషల్ మీడియాలోనూ ఆ సందడి కనిపించాలి కదా! అందుకే నేటితరం యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి (AI) సైతం గణనాథుడి ఉత్సవాలకు సంబంధించిన పనులు అప్పజెప్పారు. దీంతో సోషల్ మీడియా (Social media) వేదికలన్నీ ఏఐ టెక్నాలజీ రూపొందిన 'బప్పా ఆగయా'.. వీడియోలతో సందడి చేస్తున్నాయి. ఈ వీడియోలలో గణేశుడు తన వాహనమైన ఎలుకతో భూమి మీదకు ఎలా పయనమవుతున్నాడనేవి ఎంతో క్రియేటివ్‌గా చూపించారు.

ఇక తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియోలో వినాయకుడు.. ఉదయాన్నే నిద్రలేచి, మోడ్రన్ వర్కౌట్ లుక్‌లో జిమ్ చేస్తూ కనిపిస్తాడు. ఆ తర్వాత ట్రెండీ దుస్తులు ధరించి, అద్దంలో తనను తాను చూసుకుంటూ నవ్వుతాడు. అనంతరం తల్లిదండ్రులైన శివపార్వతులకు టాటా చెప్పి తన వాహనమైన ఎలుకతో కలిసి స్కూటీపై భూమిపైకి పయనమయ్యాడు. వినాయకుని ఆధునిక యవత దృక్కోణంతో చూపించడం ఈ వీడియోకు విశేష ఆదరణను తెచ్చిపెట్టింది. వినాయక చవితి, హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భక్తులు గణపతిని ఆరాధించి, పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. అయితే, ఆధునిక యుగంలో గణేశుడి ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కాపాడుతూనే, మరోవైపు యువతను ఆకర్షించే విధంగా ఈ వీడియోలు రూపొందించటం సంస్కృతి సాంప్రదాయాల పట్ల యువత ఇచ్చే విలువను తెలియజేస్తున్నాయి. అంతేకాదు, ఈ వీడియోలు కేవలం వినోదాత్మకంగా మాత్రమే కాకుండా, సాంకేతికత, సంప్రదాయం మధ్య సమతుల్యతను సాధించాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఏఐ వీడియోలు సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి.

Next Story