- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇన్‌స్టా లవ్.. ప్రియుడి కోసం దేశం దాటి వచ్చింది..కానీ చివరికి!
బంగ్లాదేశ్ యువతి ఒకరు తన ప్రియుడి కోసం దేశం దాటి భారత్ కు వచ్చింది. కానీ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువతిని అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా ప్రేమకు, కుల మత భేదాలు లేవని అంటారు. సోషల్ మీడియా ప్రభావం పెరిగిన తరవాత ప్రాంతీయభేదాలు కూడా లేవని అనిపిస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తరవాత దేశాల మధ్య దూరం అంతే ఉన్నా మనుషులు మధ్య మాత్రం చాలావరకు దూరం తగ్గిపోయింది. ఫేస్ బుక్, స్నాప్ చాట్, ఇన్ స్టాగ్రామ్ ఇలా ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో పరిచయాలు పెంచుకుని ప్రేమలో పడుతున్నారు. అప్పట్లో పాకిస్థాన్ మహిళ ఒకరు ఇన్ స్టాలో ఏర్పడిన పరిచయంతో భర్తను వదిలి ఢిల్లీకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ యువతి ఒకరు తన ప్రియుడి కోసం దేశం దాటి భారత్ కు వచ్చింది. కానీ స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువతిని అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ కు చెందిన కొనికా అనే యువతికి మహారాష్ట్రకు చెందిన చిన్మయ్ జగన్నాథ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ప్రియుడిని వదిలి కొనికా ఉండలేపోయింది.
ప్రియుడు ఇండియాకు రావాలని కోరడంతో పాటు వీసా లేకుండా ఎలా రావాలో సూచనలు ఇచ్చాడు. అతడి సూచనలతో భారత్ లోకి చొరబడిన కొనికా ప్రియుడితో కలిసి సహజీవనం చేయడం మొదలుపెట్టింది. కొత్తముఖం కావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిని పోలీసులు అరెస్ట్ చేయగా తాను చిన్మయ్ జగన్నాథ్ పెళ్లి చేసుకున్నామని చెప్పింది. పెళ్లికి సంబంధించిన ఆధారాలు చూపించాలని అడగ్గా నీళ్లు మింగింది. ప్రస్తుతం యువతి పోలీసుల అదుపులో ఉండగా ఆమెను అనేక కోణాల్లో విచారిస్తున్నారు.






