రూ.500 కూడా రూ.50లాగే అనిపిస్తున్నాయి.. బెంగుళూరులో ఖర్చులపై యువతి ఆవేదన

by Ajay Maddhiboyina |

బెంగళూరులో పెరుగుతున్న జీవ‌న వ్య‌యంపై ఓ యువ‌తి సోష‌ల్ మీడియా వేధిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేసింది. బెంగళూరులో రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తున్నాయ‌ని, స్నాక్స్ కొనుగోలు చేసినా అంతే అంటూ తెలిపింది.

రూ.500 కూడా రూ.50లాగే అనిపిస్తున్నాయి.. బెంగుళూరులో ఖర్చులపై యువతి ఆవేదన
X

దిశ, వెబ్ డెస్క్: బెంగళూరులో పెరుగుతున్న జీవ‌న వ్య‌యంపై ఓ యువ‌తి సోష‌ల్ మీడియా వేధిక‌గా ఆవేద‌న వ్య‌క్తం చేసింది. బెంగళూరులో రూ.500 కూడా రూ.50 లాగే అనిపిస్తున్నాయ‌ని, స్నాక్స్ కొనుగోలు చేసినా అంతే అంటూ తెలిపింది. ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్ళామంటే రూ.500 ఊరికే ఖ‌ర్చు అవుతున్నాయ‌ని చెప్పింది. ఇంట్లో ఉన్నా కూడా అలాగే ఖ‌ర్చు అవుతున్నాయ‌ని, స్నాక్స్ తిన్నా కూడా భారీగా రేట్లు ఉన్నాయ‌ని తెలిపింది. ఇక్క‌డ ఊపిరి తీసుకోవ‌డం క‌ష్ట‌మో లేదో కానీ, మీ ప‌దిశాతం ఇంక్రిమెంట్ మాత్రం ఖ‌ర్చు అవుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

బెంగ‌ళూరులో మ‌రీ జీవ‌న వ్య‌యం ఇంతాలా ఎందుకు పెరుగుతోంది అంటూ వాపోయింది. ఇదిలా ఉంటే ఐటీ హ‌బ్ గా మారిన బెంగళూరులో రోజురోజుకు ఖ‌ర్చులు భారీగా పెరిగిపోతున్నాయి. సింగిల్ బెడ్రూమ్ అద్దెకు తీసుకోవాల‌ని అనుకున్నా రూ.20వేల‌కు పైగానే ఉంది. ఇక తాజాగా యువ‌తి వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు సైతం అది నిజ‌మే అని చెబుతున్నారు. బెంగ‌ళూరులో బ‌తకాలి అంటే క‌నీసం రూ.1ల‌క్ష సంపాదించాల‌ని అప్పుడే బెంగళూరుకు రావాల‌ని కామెంట్లు చేస్తున్నారు. అంతే కాకుండా నగరంలోని అధిక అద్దెలు, ట్రాఫిక్, ఖరీదైన జీవనశైలిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story