బాలాపూర్ గణేశుడికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. ఎంతో తెలిస్తే షాకే!

by Kema Shiva Kumar |   (  Updated:2025-09-08 16:46:56  IST  )

బాలాపూర్ (Balapur).. ఆ పేరు వింటేనే గుర్తొచ్చేది వినాయకుడి లడ్డూ.

బాలాపూర్ గణేశుడికి రికార్డ్ స్థాయిలో హుండీ ఆదాయం.. ఎంతో తెలిస్తే షాకే!
X

దిశ, వెబ్‌డెస్క్: బాలాపూర్ (Balapur).. ఆ పేరు వింటేనే గుర్తొచ్చేది వినాయకుడి లడ్డూ. అక్కడ ప్రతిష్టించే గణనాథుడి చేతిలో లడ్డూను కైవసం చేసుకుంటే సకల శుభాలు కలిగి కోటీశ్వరులవుతారని ప్రసిద్ధి. అలాంటి బాలాపూర్ గణనాథుడి మండపాన్ని ఈసారి నిర్వాహకులు స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో ఏర్పాటు చేశారు. దీంతో పట్టణ ప్రజలంతా బాలాపూర్ గణేశుడి దర్శనంతో పాటు వేసిన స్వర్ణగిరి సెట్‌‌ను కనులారా వీక్షించేందుకు లక్షల్లో తరలివచ్చారు. గతంలోనూ కైలాసగిరి, బద్రినాథ్, రామేశ్వరమ్, అయోధ్య రాముని ఆలయం వంటి ప్రసిద్ధ ఆలయాలను నమూనాగా రూపొందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భక్తుల తాకిడితో బాలాపూర్ గణేశుడికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం సమకూరింది. 11 రోజుల ఉత్సవాల్లో భాగంగా భక్తులు ఏకంగా రూ.23,13,760 కానుకల రూపంలో సమర్పించుకున్నారు. అయితే, ఇప్పటికే బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి లడ్డు వేలం ద్వారా రూ.35 లక్షల ఆదాయం వచ్చిన విషయం తెలిసిందే.

Next Story