- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పసికందు కాళ్ళను వేడినూనెలో ముంచిన అయ్యప్ప స్వాములు.. దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్స్
by Muthe.Rajitha |

X
దిశ, వెబ్ డెస్క్ : భక్తి పేరుతో మూఢ విశ్వాసాలు పెచ్చు మీరుతున్నాయి. చిన్నపిల్లలపై కూడా భక్తి మూఢ విశ్వాసాలు రుద్ది వారి ప్రాణాల మీదికి తెస్తున్నారు కొంతమంది. అయితే ఇటీవల ఓ పసికందు మీద జరిగిన దారుణ ఘటన ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయ్యప్ప స్వాములు అంతా కలిసి ఓ చిన్నారి కాళ్ళను బజ్జిలు వేయిస్తున్న వేడి నూనెలో ముంచారు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ ఉన్న ఆ పసికందు ఒక్కసారిగా గావు కేక పెట్టి ఏడ్చాడు. చిన్నారి అలా అరుస్తున్నా అక్కడ ఉన్న స్వాములు అదేదో సాధారణమే అన్నట్టు ఎవరూ స్పందించకపోవడం శోచనీయం. అంతేకాదు ఈ ఘటన జరుగుతున్నపుడు ఆ చిన్నారి తండ్రి అక్కడే ఉండి, ఈ తతంగాన్ని నడిపించడం గమనార్హం. కాగా ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Next Story






