‘మీరు ఇంకోసారి ఇక్కడికి రావొద్దు’.. ర్యాపిడో అతనికి ఆటో డ్రైవర్ల హెచ్చరిక

by Gantepaka Srikanth |

దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు కూడా భారీగానే విస్తరిస్తున్నాయి.

‘మీరు ఇంకోసారి ఇక్కడికి రావొద్దు’.. ర్యాపిడో అతనికి ఆటో డ్రైవర్ల హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు కూడా భారీగానే విస్తరిస్తున్నాయి. ఇది వరకు బస్సులు, ఆటోల్లో వెళ్లే వారంతా ఇప్పుడు ర్యాపిడోలు(Rapido Driver), ఊబర్లు వంటి యాప్స్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో తమ జీవన ఉపాధిపై ఈ ఆన్‌లైన్ యాప్‌లు చాలా ప్రభావం చూపిస్తున్నాయని ఇప్పటికే గగ్గోలు పెడుతున్నారు. తాజాగా ఖమ్మం(Khammam) జిల్లాలో ర్యాపిడో నడిపే వ్యక్తికి అనూహ్య పరిణామం ఎదురైంది. ఖమ్మం బస్టాండ్‌లో ప్రయాణికుడిని ఎక్కించుకునేందుకు వచ్చిన ర్యాపిడో అతనికి అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు(Auto Drivers) వార్నింగ్ ఇచ్చారు. మరోసారి మీరు ఇక్కడికి రావొద్దు. మీ వల్ల మాకు గిరాకీ రావడం లేదు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీనికి ర్యాపిడో వ్యక్తి స్పందిస్తూ.. మీరెవరు నన్ను రావొద్దు అని చెప్పడానికి.. నేనేమైనా ప్రయాణికుడి వద్దకు వెళ్లి నా బైక్ ఎక్కండి అని బతిమాలుకుంటున్నానా... వాళ్లు బుక్ చేసుకుంటేనే ఇక్కడికి వచ్చాను అని సమాధానం ఇచ్చారు. దీంతో ర్యాపిడో వ్యక్తికి, ఆటో డ్రైవర్లకు మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపుచేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Next Story