పాపం.. అనాథ పిల్లాడిని బెల్టుతో చావబాదిన నిర్వాహకుడు.. (వీడియో)

by Sujitha Rachapalli |

తమిళనాడు కోయంబత్తూరు జిల్లా కొట్టైపాలయం ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. గ్రేస్ హ్యాపీ హోమ్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఓ అనాథాశ్రమంలో చిన్న పిల్లాడిపై బెల్ట్‌తో విరుచుకుపడ్డాడు నిర్వాహకుడు. 26 మంది ఉన్న ఈ ప్రైవేట్ బాలల

పాపం.. అనాథ పిల్లాడిని బెల్టుతో చావబాదిన నిర్వాహకుడు.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : తమిళనాడు కోయంబత్తూరు జిల్లా కొట్టైపాలయం ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. గ్రేస్ హ్యాపీ హోమ్ ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఓ అనాథాశ్రమంలో చిన్న పిల్లాడిపై బెల్ట్‌తో విరుచుకుపడ్డాడు నిర్వాహకుడు. 26 మంది ఉన్న ఈ ప్రైవేట్ బాలల సంక్షణ కేంద్రంలో అనాథ బాలుడిని బెల్ట్‌తో క్రూరంగా కొట్టిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలుడు నొప్పితో కేకలు వేస్తున్నా.. ఇతర పిల్లలు భయంతో చూస్తూ నిలబడినా పట్టించుకోకుండా ఒకటే బాదుడు బాదాడు. దీంతో నెటిజన్లు ప్రభుత్వ చర్యల గురించి ప్రశ్నిస్తున్నారు. కాగా ఈ వీడియో ఆధారంగా బాధిత బాలుడి బంధువుల ఫిర్యాదుతో కోయంబత్తూరు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

VIDEO

Next Story