VIDEO: జిమ్‌లో కుస్తీ పడుతున్న తెలంగాణ ఎంపీ!

by Ajay Maddhiboyina |

ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జిమ్‌లో కుస్తీ పడుతున్నారు. భారీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఆయన ఫోటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చారు.

VIDEO: జిమ్‌లో కుస్తీ పడుతున్న తెలంగాణ ఎంపీ!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ జిమ్‌లో కుస్తీ పడుతున్నారు. భారీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ ఆయన ఫోటోలు, వీడియోలకు ఫోజులు ఇచ్చారు. ఎప్పుడూ పొలిటికల్ కామెంట్లు, ఈవెంట్లతో హాట్ టాపిక్‌గా నిలిచే ఓవైసీ జిమ్‌లో కుస్తీ పడటంతో దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియో ఓవైసీ వ్యాయామం కోసం జిమ్‌కు వెళ్లినప్పటిది కాదు. ఆయన తాజాగా బహదుర్‌పురాలో నూతనంగా ఏర్పాటైన జిమ్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్లి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాసేపు అందులోని పరికరాలతో వ్యాయామం చేశారు. వీడియో వైరల్ అవ్వడంతో ఓవైసీ లోక్ సభలో పొలిటికల్ డిబేట్లతో కుస్తీ పడితే జిమ్‌లో డెడ్ లిఫ్ట్‌లతో కుస్తీ పడుతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. video

Next Story