- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి 'బాణం' వివాదం.. మసీదు వైపు గురిపెట్టిన హిందుత్వ నేత హర్షిత! కేసు నమోదు
గతంలో హైదరాబాద్ నగరంలో బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీ లత మసీదు వైపు బాణం వేస్తున్నట్లు చేసిన హావభావాలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. తాజాగా సరిగ్గా అలాంటి ఘటనే కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బెళగావిలో పునరావృతమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: గతంలో హైదరాబాద్ నగరంలో బీజేపీ నాయకురాలు కొంపెల్ల మాధవీ లత మసీదు వైపు బాణం వేస్తున్నట్లు చేసిన హావభావాలు ఎంతటి సంచలనం సృష్టించాయో తెలిసిందే. తాజాగా సరిగ్గా అలాంటి ఘటనే కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన బెళగావిలో పునరావృతమైంది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశారన్న ఆరోపణలపై మహారాష్ట్రకు చెందిన హిందుత్వ నేత హర్షిత ఠాకూర్‌తో పాటు మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అసలేం జరిగిందంటే?
బెళగావి సమీపంలోని మచ్చే గ్రామంలో ఆదివారం 'అఖండ హిందూ సమ్మేళనం' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముందు గ్రామంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ఊరేగింపులో వాహనంపై నిల్చున్న హర్షిత.. అక్కడి అన్సారీ దర్గా (మసీదు) సమీపానికి రాగానే వాహనాన్ని ఆపారు. అనంతరం దర్గా వైపు చూస్తూ బాణం వదులుతున్నట్లుగా హావభావాలను ప్రదర్శించినట్లు పలు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వివాదంగా మారింది. దర్గా వైపు బాణం వేస్తున్నట్లు సైగలు చేయడమే కాకుండా, సభలో ఆమె ఒక వర్గాన్ని కించపరిచేలా, మతపరమైన మనోభావాలు దెబ్బతినేలా రెచ్చగొట్టే ప్రసంగం చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై అబ్దుల్ ఖాదర్ ముజావర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు స్పందించిన బెళగావి రూరల్ పోలీసులు.. హర్షిత ఠాకూర్‌తో పాటు కార్యక్రమ నిర్వాహకులైన సుప్రీత్ సింపి, శ్రీకాంత్ కాంబ్లే, బెట్టప్ప తారిహాల్, శివాజీ షాహాపూర్కర్, గంగారాం తారిహాల్, మల్లప్పలపై కేసులు నమోదు చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, మతపరమైన మనోభావాలను దెబ్బ తీయడం వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ ఘటనతో పోలిక..
గతంలో హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా బీజేపీ నేత కొంపెల్ల మాధవీ లత కూడా ఒక ప్రార్థనా మందిరం వైపు బాణం వేస్తున్నట్లు సంజ్ఞలు చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే తాను మసీదును ఉద్దేశించి అలా చేయలేదని ఆమె వివరణ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా హర్షిత ఠాకూర్ ఘటన మరోసారి ఆ వివాదాన్ని గుర్తుచేసింది.






