- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగారం ఎత్తుకెళుతున్న చీమలు.. షాకింగ్ వీడియో వైరల్
మగువలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండుగ వచ్చినా ఏ వేడుక వచ్చినా మెడలో బంగారం మెరవాల్సిందే. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా బంగారంకు చాలా డిమాండ్ ఉంటుంది.

దిశ, వెబ్ డెస్క్: మగువలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పండుగ వచ్చినా ఏ వేడుక వచ్చినా మెడలో బంగారం మెరవాల్సిందే. కేవలం ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో ఏ దేశం వెళ్లినా బంగారంకు చాలా డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం అయితే బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 10 గ్రాముల బంగారం ఏకంగా లక్ష ఇరవైమూడు వేలకు పెరిగింది. అంత రేటు ఉన్న బంగారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి లేదంటే దొంగలు కొట్టేస్తారు.
అయితే మనుషులు కొట్టేస్తే పట్టుకోవచ్చు కానీ ఇంట్లోనే కనిపించని దొంగలు ఉన్నాయన్న సంగతి చాలా మందికి తెలియదు. అవి మరేంటో కాదు చీమలు. బంగారం చీమలు ఎందుకు ఎత్తుకుపోతాయ్ అనుకోవచ్చు.. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే నమ్మకుండా ఉండలేరు. వీడియోలో చీమలు ఓ బంగారం చెవి కమ్మను ఎత్తుకుపోతున్నాయి. ఎక్కడా పడేయకుండా జాగ్రత్తగా కొన్ని చీమలు కలిసి ఆ కమ్మను తీసుకువెళుతున్నాయి.
సాధారణంగా అయితే చీమలు ఆహారపదార్థాలను ఎత్తుకుపోతుంటాయ్. కానీ బంగారం ఎత్తుకెళ్లడం ఆశ్చర్యకరం. బంగారంకు ఏదైనా తీపి పదార్థం అంటుకుందో ఏమో కానీ హ్యాపీగా తీసుకువెళ్లాయ్. ఇక ఈ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. అవి ఆడ చీమలు ఏమో అందుకే ఎత్తుకుపోతున్నాయ్ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, మరో నెటిజన్ మా ఇంటికి తీసురండి మీకు కావాల్సినంత స్వీట్ పెడతా అంటూ కామెంట్ పెట్టాడు. ఆ వీడియో మీరూ చూడాలంటే లింక్ పై క్లిక్ చేయండి.






