రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన: రూ.5 భిక్షం వేశాడని యజమానిపై హత్యాయత్నం

by Kema Shiva Kumar |

మహబూబాబాద్‌లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. రూ.5 భిక్షం ఇచ్చాడన్న కోపంతో షాపు యజమానిపై ఓ యాచకుడు కత్తితో దాడికి యత్నించాడు.

రాష్ట్రంలో మరో షాకింగ్ ఘటన: రూ.5 భిక్షం వేశాడని యజమానిపై హత్యాయత్నం
X

దిశ, వెబ్‌డెస్క్: పాపం కదా.. అని తలచి భిక్షం వేసిన వ్యక్తిపైనే ఓ యాచకుడు కత్తితో దాడికి దిగిన వింత ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. రూ.5 భిక్షం వేశాడనే కోపంతో ఆ యాచకుడు షాపు యజమానిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక సమాచారం ప్రకారం.. శ్రీనివాస్ అనే వ్యక్తి మహబూబాబాద్‌లో వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ యాచకుడు అతని షాపు వద్దకు వచ్చి భిక్షం అడిగాడు. శ్రీనివాస్ మానవత్వంతో అతనికి రూ.5 ఇచ్చాడు. అయితే, తనకు ఇచ్చిన చిల్లర తక్కువగా ఉందని, మరిన్ని డబ్బులు కావాలని ఆ యాచకుడు శ్రీనివాస్‌తో గొడవకు దిగాడు.

రెప్పపాటులో దాడికి కత్తితో దాడికి యత్నం..

ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన యాచకుడు, తన వద్ద ఉన్న కత్తిని తీసి ఒక్కసారిగా శ్రీనివాస్‌పై దాడికి యత్నించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న శ్రీనివాస్ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యాచకుడిని అదుపులోకి తీసుకున్నారు.

Next Story