- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అన్నాబెల్లే బొమ్మ అదృశ్యం.. రెండురోజుల్లో రెండు ఘోర సంఘటనలు.. యజమాని సమాధానం ఇదే!
మనలో చాలామందికి అన్నాబెల్లే డాల్ గురించి తెలిసే ఉంటుంది. 'ది కంజూరింగ్' హారర్ మూవీ సిరీస్ ద్వారా భయంకరమైన బొమ్మగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది.

దిశ, వెబ్ డెస్క్: మనలో చాలామందికి అన్నాబెల్లే డాల్ (Annabelle doll) గురించి తెలిసే ఉంటుంది. 'ది కంజూరింగ్' (The Conjuring) హారర్ మూవీ సిరీస్ ద్వారా భయంకరమైన బొమ్మగా ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది. వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాలు ఎన్నో రాత్రులు ప్రజలను నిద్రలేకుండా చేశాయి. కాసేపు ఆ సినిమా గురించి పక్కన పెడితే.. తాజాగా ఈ బొమ్మ గురించి పలు పుకార్లు జోరుగా ప్రచారం అవుతున్నాయి. అన్నాబెల్లే డాల్ మ్యూజియం నుంచి అదృశ్యమైందంటూ వార్తలు రావడంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు తెరదింపారు ఈ డాల్ యజమాని టోనీ స్పెరా.
అమెరికాలో ఇటీవల నిర్వహించిన పరాన్మార్మిక టూర్ సందర్భంగా అన్నాబెల్లే డాల్ న్యూఓర్లిన్స్ (New Orleans) నగరంలో కనిపించింది. అదే సమయంలో అక్కడ రెండు పెద్ద సంఘటనలు జరిగాయి. మే 15న నాటోవే ప్లాంటేషన్ హౌస్ అగ్నిప్రమాదం, మే 16న ఖైదీల జైలు నుంచి పారిపోవడం. దీంతో ఈ బొమ్మ దుష్ట శక్తులకు సంకేతమా? అనే సందేహాలు మరోసారి జనాల్లో మొదలయ్యాయి. మరోవైపు సోషల్ మీడియాలో ఈ బొమ్మ కనిపించకుండా పోయిందని పుకార్లు వెలువడ్డాయి. ఈ వార్తలపై డాల్ యజమాని టోనీ స్పెరా స్పందిస్తూ.. బొమ్మ ఎప్పుడూ తమ అదుపులోనే ఉందని, ఎక్కడా అదృశ్యమవలేదని స్పష్టం చేశారు. అలాగే, తాము టూర్‌కు తీసుకెళ్లినప్పుడల్లా, క్యాథలిక్ ఫాదర్ తమతోపాటే ఉంటూ దానిపై పవిత్ర నీరు, నూనెతో ఆశీర్వాదం చేస్తూ జాగ్రత్తగా రక్షిస్తారని స్పష్టం చేశారు.
ప్రస్తుతం అన్నాబెల్లే డాల్ కనెక్టికట్‌లోని వారెన్ ఓకల్ట్ మ్యూజియంలో భద్రంగా ఉంచబడిందని తెలిపారు. ఈ మ్యూజియం పబ్లిక్‌కు అందుబాటులో ఉండదు. డాల్ పెట్టిన పెట్టెకు క్రాస్ గుర్తులు చెక్కి, పవిత్ర పదార్థాలతో రక్షణ కల్పించారు. ఈ మ్యూజియాన్ని పరానార్మల్ అన్వేషణలో ఆసక్తి ఉన్నవారి కోసం ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే టూర్‌లు నిర్వహించబడతాయి. ఇక నిజానికి ఈ బొమ్మ ప్రమాదకరమైనదా?లేదా? అనే దానిపై స్పష్టత లేదు.






