- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిక్నిక్‌లో ఎంజాయ్ చేస్తోన్న ఫ్యామిలీకి ఊహించని షాక్.. ఏమైందంటే?(వీడియో)
చాలా మంది నది ఒడ్డున, సరస్సు, పార్కు, ఇతర అందమైన ప్రదేశాల్లో కుటుంబాలతో కలిసి ఆనందంగా గడపడానికి విహారయాత్రకు వెళుతుంటారు.

దిశ,వెబ్‌డెస్క్: చాలా మంది నది ఒడ్డున, సరస్సు, పార్కు, ఇతర అందమైన ప్రదేశాల్లో కుటుంబాలతో కలిసి ఆనందంగా గడపడానికి విహారయాత్రకు వెళుతుంటారు. ఈ క్రమంలోనే అందమైన ప్రదేశాలను సెర్చ్ చేసుకుని ఫ్రెండ్స్‌తో లేదా బంధువులతో పిక్నిక్ ప్లాన్ చేసుకుంటారు. అక్కడ ఎంతో సంతోషంగా గడపవచ్చు అని కలలుకంటారు. ఈ తరుణంలో ఓ విహారయాత్రకు వెళ్లిన కుటుంబాలకు ఊహించని షాక్ ఎదురైంది.
అస్సాం-అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో సందర్శించడానికి చాలా అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ ప్రకృతి యొక్క అందమైన దృశ్యాలు ఆకర్షణీయంగా ఉంటాయి. కానీ.. అలాంటి ప్రదేశాల్లో అడవి జంతువులు కూడా దర్శనమిస్తాయి. ఈ క్రమంలో అస్సాం-అరుణాచల్ సరిహద్దు ప్రదేశానికి చాలామంది పిక్నిక్ వచ్చారు. ఈ నేపథ్యంలో అందరూ కలిసి నది ఒడ్డున ఒకే చోట కూర్చుని పిక్నిక్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడే వంట కూడా ప్రిపేర్ చేస్తున్నారు.
ఈ క్రమంలో అడవి నుంచి ఓ ఏనుగు చప్పుడు కాకుండా బయటకు వచ్చింది. ఇక ఏనుగును చూసిన వాళ్లందరూ ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో వారందరూ తమ తమ వస్తువులను వదిలేసి పారిపోయారు. ప్రజలు పారిపోవడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏనుగు నదిలో నుంచి వెళ్తుండగా ఓ కారు వచ్చింది. ఈ క్రమంలో ఏనుగు కారును తప్పించుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి హాని జరగలేదు. ఈ వీడియోను IFS అధికారి ప్రవీణ్ కస్వాన్ తన ట్విట్టర్ ఖాతాలో @ParveenKaswan షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. 'ప్రభుత్వం అలాంటి ప్రదేశాల్లో ప్రజలు రాకుండా నిషేధించాలి' అని, మరొకరు, 'ఈ ప్రదేశం ఏనుగుల నిలయం. ఇక్కడికి మనుషులు వస్తే, ఏనుగులు ఖచ్చితంగా కోపం తెచ్చుకుంటాయి', 'అటవీ శాఖ ఈ ఘటన గురించి ఆలోచించాలి' అంటూ కామెంట్లు పెడుతున్నారు.






