Viral News:బైకర్లకు ఎదురైనా ఏనుగు.. ఒక్కసారిగా బైక్ ఆపడంతో!?

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-30 11:20:42  IST  )

అడవి మార్గాల గుండా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

Viral News:బైకర్లకు ఎదురైనా ఏనుగు.. ఒక్కసారిగా బైక్ ఆపడంతో!?
X

దిశ,వెబ్‌డెస్క్: అడవి మార్గాల గుండా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అడవి జంతువులకు కొంచెం శబ్దం వినిపించిన వాటికి ఏమైనా హని కలిగిస్తామో అని దాడికి పాల్పడుతాయి. ఒకవేళ అడవి జంతువులు ఎదురైనా నెమ్మదిగా అక్కడి నుంచి జారుకోవాలి. కానీ.. వాటిని బెదరగొట్టిన, కంగారు పెట్టినా అవి తిరగబడతాయి. ఈ క్రమంలో దాడికి పాల్పడతాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.

కేరళలో రోడ్డు పైకి ఏనుగులు వచ్చి వాహనాదారుల పై దాడి చేస్తున్న ఘటనలు చోటుచేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తాజాగా కేరళలోని పాలక్కాడ్ జిల్లా నెల్లియంపతిలోని కొండ ప్రాంతంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారికి ఏనుగు ఎదురు వచ్చింది. ఈ క్రమంలో వారు భయభ్రాంతులకు గురయ్యారు. చుట్టూ అడవి ప్రాంతం ఏమి చేయాలో వారికి అర్థం కాలేదు. ఈ నేపథ్యంలో ఆ ఏనుగును చూసి ఆందోళన చెందుతున్న వారి పై ఏనుగు దాడికి యత్నించింది. మూల మలుపు వద్ద ఏనుగును గమనించి బైకును ఆపారు. అది గమనించిన ఏనుగు బైకర్ల వైపు దూసుకొచ్చింది. ఈ క్రమంలో బైకర్లను కొంచెం దూరం వరకు తరిమేసింది. అనంతరం ఏనుగు తిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story