- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Love Story: ఆంధ్ర అబ్బాయి కోసం అమెరికా అమ్మాయి.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న లవ్ స్టోరీ!
వారిది ఎల్లలు దాటిన ప్రేమ. వారి ప్రేమకు భాష, సంస్కృతి ఏది అడ్డురాలేదు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఇలాంటి లవ్‌స్టోరీలు ఉంటాయని ఓ జంట నిరూపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వారిది ఎల్లలు దాటిన ప్రేమ. వారి ప్రేమకు భాష, సంస్కృతి ఏది అడ్డురాలేదు. సినిమాల్లోనే కాదు.. నిజ జీవితంలోనూ ఇలాంటి లవ్‌స్టోరీలు ఉంటాయని ఓ జంట నిరూపించారు. అది కూడా భారత అబ్బాయి కోసం అమెరికా అమ్మాయి (American girl) సముద్రాలు దాటి ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామానికి తరలి వచ్చింది. సోషల్ మీడియానే ఆ జంటను కలిపింది. వారి ప్రేమకథ సాధారణ 'హాయ్'తో ప్రారంభమైంది. అమెరికాకు చెందిన జాక్లిన్ ఫోరెరో (Jaclyn Forero) అనే అమ్మాయి.. ఏపీకి చెందిన ఫోటోగ్రాఫర్ చందన్ (Chandan) సింగ్ అనే యువకుడితో (Instagram) ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఈ జంట ఇప్పుడు వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రియుడిని పెళ్లి చేసుకోవడం కోసం జాక్లిన్ తన తల్లితో కలిసి అమెరికా నుంచి ఆంధ్రాకు వచ్చింది. ఈ సందర్భంగా లవ్ స్టోరిని జాక్లిన్ ఫోరెరో ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా 45 సెకన్ల వీడియోను పోస్ట్ చేసింది.
‘నేను చందన్‌కు ఫస్ట్ మెసేజ్ చేశాను. అతని అభిరుచుల పట్ల ఆకర్షితురాలైనాను. మ్యూజిక్, ఆర్ట్, ఫోటోగ్రఫీ లాంటి చాలా విషయాల్లో మా ఇద్దరి అభిరుచులు చాలా వరకు కలిశాయి. ఆన్‌లైన్‌లో మేము 8 నెలలుగా డేటింగ్‌లో ఉన్నాము. ఆ తర్వాత మా అమ్మ ఆమోదం పొందిన తర్వాత తనతో జీవితకాలం కలిసి ఉండటానికి అమ్మతో కలిసి భారత్‌కు వచ్చాను. భాగస్వామిగా నేను కోరకున్నది అతన్నే. వినయం, శ్రద్ధ, తెలివి, నిజాయితీ, అధ్యాత్మికం, నిస్వార్థం, ఫన్నీ, అందం, రొమాంటిక్ మరెన్నో ఉన్నాయి. మరోవైపు చాలా మంది మా బంధాన్ని చూసి కామెంట్స్ చేశారు. మరీ ముఖ్యంగా మా ఇద్దరి మధ్య ఉన్న వయసు తేడా గురించి మాట్లాడారు. మా ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు చూశాం. నేను చందన్ కన్నా 9 ఏళ్లు పెద్దదాన్ని, కానీ మాకు అది పెద్ద సమస్యగా అనిపించలేదు, కానీ ఆ దేవుడే మమ్మల్ని కలిపాడు. కలిసి ఉండాలని దీవించాడు’ అని వారిద్దరూ కలిసిన వీడియో షేర్ చేసింది.
మరోపోస్టులో మేము 14 నెలలు కలిసి ఉన్నాము.. ఒక పెద్ద కొత్త అధ్యాయానికి సిద్ధంగా ఉన్నామని ఫోటోలు షేర్ చేశారు. వీరి లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జంట ఎప్పుడూ హ్యాపీగా కలిసి ఉండాలని నెటిజన్లు కోరకుంటున్నారు. వారికి విషెస్ చెబుతున్నారు. ఇక, చందన్ కోసం ఆమె అమెరికాను విడిచి వచ్చి మరీ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వస్తోంది. అందులో వారి ప్రేమ కథను పంచుకున్నారు.






