- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వంట చేయమంటే పాన్ నేలకేసి కొట్టిన రోబో.. షాకింగ్ వీడియో వైరల్
ప్రస్తుతం మనుషులను రోబోలు రీప్లేస్ చేస్తున్నాయి. కార్యాలయాల్లో, ఇండ్లలో పనులు చేసేందుకు రోబోలను కొనుగోలు చేస్తున్నారు. అయితే రోబోలతో అంత ఈజీ కాదని రజినీకాంత్ రోబో సినిమాలో చూపించిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం మనుషులను రోబోలు రీప్లేస్ చేస్తున్నాయి. కార్యాలయాల్లో, ఇండ్లలో పనులు చేసేందుకు రోబోలను కొనుగోలు చేస్తున్నారు. అయితే రోబోలతో అంత ఈజీ కాదని రజినీకాంత్ రోబో సినిమాలో చూపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రియల్ లైఫ్ లోనూ ఓ రోబో రెచ్చిపోయింది. యజమాని ఒకటి చెబితే ఆ రోబో మరొకటి చేసింది. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసకున్నట్టు తెలుస్తోంది. కాగా యజమాని తన కోసం ఆహారం వండాలని రోబోను ఆదేశిస్తాడు.
కానీ ఆ ఆదేశాలను ఏఐ రోబో పాటించకుండా కోపంతో రగిలిపోయింది. తన చేతిలో ఉన్న ప్యాన్ కిందపడేయాలని చూడగా మొదట యజమాని అడ్డుకున్నాడు. మరోసారి ఆదేశాలు ఇస్తూ అతడు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా రోబో పాన్ తీసి కిందపడేసింది. తరవాత మారాం చేసినట్టు గెంతి కిందపడిపోయింది. ఇక వీడియో వైరల్ అవ్వడంతో ప్రస్తుతం రోబోలు ఇంకా తయారీ దశలోనే ఉన్నాయని తయారు చేసిన సంస్థ చెబుతోంది. నిర్మాణ దశలో ఇలాంటివి సహజమేనని వాదిస్తోంది. వీడియో






