- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ICUలో అలేఖ్య..వీడియో వైరల్ !
అలేఖ్య చిట్టి పికిల్స్ ( Alekhya Chitti Pickles ) వివాదం గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా

దిశ, వెబ్ డెస్క్: అలేఖ్య చిట్టి పికిల్స్ ( Alekhya Chitti Pickles ) వివాదం గత నాలుగు రోజులుగా కొనసాగుతోంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అలేఖ్య చిట్టి పికిల్స్ తిట్టిన బూతులు, ఆమె చేసిన బాగోతమే బయటపడుతోంది. అదే సమయంలో ఆ ముగ్గురు అక్కా- చెల్లెళ్లకు... నెటిజెన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా... అలేఖ్య చిట్టి పికిల్స్ కు వ్యతిరేకంగా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
అయితే ఈ ఇష్యులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అలేఖ్య ( Alekhya) తాజాగా ఐసీయూలో ( ICU ) చేరినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను... అలేఖ్య సోదరి సుమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో చేసే ట్రోలింగ్ తట్టుకోలేక... అలేఖ్య ఆరోగ్య పరిస్థితి దారుణంగా తయారైందని... అందుకే ఆసుపత్రిలో అడ్మిట్ చేసినట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది.
ఆక్సిజన్ తీసుకునే పరిస్థితిలో కూడా తన సోదరి అలేఖ్య ( Alekhya) లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇకనైనా తమ ఫ్యామిలీ పైన ట్రోలింగ్ ఆపండి అంటూ వేడుకుంది. మూడు నెలల కిందటే తమ తండ్రి మరణించాడని... మా ఇంట్లో మరో చావు చూడకూడదని కోరుకుంటున్నట్లు వెల్లడించింది. తమకు పచ్చళ్ళ వ్యాపారం, యూట్యూబ్ వద్దంటూ పేర్కొన్నారు. ఇక ఈ వీడియోలో అలేఖ్య ఐసీయూ బెడ్ పైన ఉన్నట్లు.. స్పష్టంగా కనిపించింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా నాలుగు రోజుల కిందట తన కస్టమర్ ను దారుణంగా తిట్టిన సంగతి తెలిసిందే.






