కల్తీ మందు తాగి 50వేల మంది మృతి.. గుట్టలు గుట్టలుగా శవాలు

by Sujitha Rachapalli |   (  Updated:2025-06-22 05:57:40  IST  )

మందు బాబులకు ఒక్క పూట మందు లేకపోయినా నిద్రపట్టదు. ఏదో కోల్పోయినట్లుగా.. నాలుక చచ్చుబడిపోయినట్లుగా ఉందంటారు. మనసు మందువైపు లాగుతుందని చెప్తుంటారు. కొందరు అయితే మందు దొరక్కపోతే వణికిపోతారు.

కల్తీ మందు తాగి 50వేల మంది మృతి.. గుట్టలు గుట్టలుగా శవాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : మందు బాబులకు ఒక్క పూట మందు లేకపోయినా నిద్రపట్టదు. ఏదో కోల్పోయినట్లుగా.. నాలుక చచ్చుబడిపోయినట్లుగా ఉందంటారు. మనసు మందువైపు లాగుతుందని చెప్తుంటారు. కొందరు అయితే మందు దొరక్కపోతే వణికిపోతారు. బాడీ పూర్తిగా కంట్రోల్‌లో లేకుండా షివర్ అయిపోతుంది. అంతగా అలవాటు పడిపోతారు. నిషాలోనే జీవితం గడపాలని కోరుకుంటారు. సుక్కెయ్యాలా రోడ్డు మీద పడాలా అన్నట్లుగా ఉంటుంది వీళ్ల కథ. అందుకే 1920-33 మధ్య కాలంలో ఆల్కహాల్ వినియోగాన్ని నిషేధించింది. మందు వాడకాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంది. కానీ ఈ చర్యలు కాస్త విషాదానికి దారితీశాయి.

మందు తాగడాన్ని ఆపేందుకు, చట్ట విరుద్ధ వినియోగాన్ని నివారించేందుకు ఇండస్ట్రియల్ ఆల్కహాల్‌ను పాయిజనస్ చేసింది. దీన్ని తాగడం ద్వారా దాదాపు 50వేల మంది మరణించినట్లు రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఎక్కడ చూసినా శవాలే కనిపించినట్లుగా ఉండేదని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఎక్సెసివ్ ఆల్కహాల్ యూసేజ్ వల్ల యూఎస్‌లో ఏటా లక్షా డెబ్బై వేల మరణాలు సంభవిస్తున్నాయని సీడీసీ నివేదించింది. కొవిడ్ పాడెమిక్ తర్వాత మరింత పెరుగుతున్నాయని.. దశాబ్దంలో ఆల్కహాల్ రిలేటెడ్ డెత్ రేట్స్ 70శాతం పెరిగాయని చెప్తుంది.

Next Story