అది వాళ్ల ఇష్టం.. లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

లివ్ ఇన్ రిలేషన్‌షిప్ నేరం కాదు అంటూ అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న 12 జంటలకు సంబంధించిన పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది.

అది వాళ్ల ఇష్టం.. లివ్ ఇన్ రిలేషన్‌షిప్స్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: లివ్ ఇన్ రిలేషన్‌షిప్ నేరం కాదు అంటూ అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న 12 జంటలకు సంబంధించిన పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. తమ కుటుంబాల నుండి బెదిరింపులను ఎదుర్కొంటున్నామని, పోలీసులు కూడా తమకు పూర్తిగా మద్దతు ఇవ్వడంలేదని జంటలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న జంటలకు పోలీసులు రక్షణ కల్పించాలని, మేజర్లు అయిన జంటలు వ్యక్తిగత స్వేచ్ఛ పొందేందుకు అర్హులు అని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నొక్కిచెప్పారు.

పౌరులు మైనర్ లేదా మేజర్, వివాహిత లేదా అవివాహిత అనే తేడా లేకుండా జీవించే హక్కును చాలా ఉన్నత స్థాయిలో పరిగణించాలని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లు వివాహం చేసుకోలేదు అనే కారణంతో రాజ్యాంగంలో వారికి కల్పించిన హక్కులను కోల్పోలేరని తెలిపింది. భారతీయ సమాజంలోని కొన్ని విభాగాల్లో అసౌకర్యంగా ఉన్నటిప్పటికీ లివ్ ఇన్ రిలేషన్ షిప్ చట్ట విదరుద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లు మేజర్లు అయినా పెళ్లి కాకుండా కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.. వారి నిర్ణయంపై కోర్టులు తీర్పు చెప్పకూడదని తెలిపింది. భవిష్యత్ లో లివ్ ఇన్ లో ఉన్న జంటలు బెదిరింపులను ఎదుర్కొంటే పోలీసులు వివరణాత్మక సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది.

Next Story