- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి వైరల్‌గా ఎయిరిండియా.. విమాన రెక్కల్లో ఆశ్చర్యకర దృశ్యం
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం గురించి తెలిసిందే. దేశీయ ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియాకు (Air India) చెందిన విమానం కుప్పకూలి 275కు పైగా ప్రజలు మృతిచెందారు. ఈ దుర్ఘటన అనంతరం ఎయిరిండియా సంస్థ వివిధ కారణాలతో వరసగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి ఎయిరిండియాకు చెందిన విమానానికి సంబంధించిన వార్త సోషల్ మీడియాల్లో వైరల్‌గా (Viral) మారింది. ముంబై నుంచి బ్యాంకాక్ (Mumbai to Bangkok) వెళ్లే విమానం రెక్కలో పక్షి గూడు (Bird nest) కనిపించటం సంచలనంగా మారింది. ఈ సంఘటన ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, ఎయిర్ ఇండియా AI2354 ఫ్లైట్ ముంబై నుంచి బ్యాంకాక్ వెళ్లేందుకు బుధవారం ఉదయం 7:45 గంటలకు రన్‌వేపై సిద్ధంగా ఉంది. అయితే విమానం రెక్కల్లో పక్షి గూడు ఉండటం చూసి ఓ ప్రయాణికుడు ఓ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. వెంటనే ఈ విషయాన్ని సిబ్బందికి తెలియజేశాడు. సిబ్బంది అప్రమత్తమై గ్రౌండ్ స్టాఫ్‌కు సమాచారం అందించారు. వారు రన్‌వేపై ఉన్న విమానం వద్దకు చేరుకొని, సదరు పక్షి గూడును జాగ్రత్తగా తొలగించారు. అయితే, ఈ కారణంగా విమానం దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయల్దేరి వెళ్లింది. ప్రయాణికులు అసహనానికి గురైనా, భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిస్థితిని సహనంగా చూశారు. విమానం రెక్క నుంచి సిబ్బంది పక్షి గూడును తొలగిస్తున్న వీడియోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.






