- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏఐ సినిమా.. కంటతడి పెట్టించేస్తుంది.. (వీడియో)
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 260 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా డెడ్ బాడీలను బంధువులకు అప్పగిస్తున్నారు అధికారులు. జూన్ 12న జరిగిన ప్రమాదం దేశం మొత్తాన్ని కంటతడి పెట్టించగా..

దిశ, వెబ్‌డెస్క్ : అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 260 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంకా డెడ్ బాడీలను బంధువులకు అప్పగిస్తున్నారు అధికారులు. జూన్ 12న జరిగిన ప్రమాదం దేశం మొత్తాన్ని కంటతడి పెట్టించగా.. మనిషి ప్రాణం ఎంత తేలికైనదో ఈ ఘటన నిరూపించింది. చదువు, ఉద్యోగం, బంధువులను కలవడం, కొత్త జీవితాన్ని ప్రారంభించడం గురించి.. ఎన్నో ఆశలతో లండన్ వెళ్తున్న ప్రయాణికుల ప్రాణాలు.. విమానం టేకాఫ్ అయిందో లేదో గాల్లో కలిసిపోయాయి. ఈ ప్లేన్ కాస్త మెడికల్ కాలేజీ హాస్టల్‌పై పడటంతో.. భవిష్యత్ తరాలకు వైద్య సేవలందించాల్సిన మెడికోలు కూడా బలయ్యారు.
కాగా ఈ సంఘటనతో ప్రభావితమైన కొందరు ఏఐ సహాయంతో సినిమాగా మలిచారు. ప్రయాణికులు ఇంటి నుంచి ప్రారంభమైంది మొదలు.. ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోవడం.. అధికారుల చెకింగ్.. ప్లేన్ టేకాఫ్.. టెక్నికల్ ఇష్యూ అని తెలిసి భయపడిపోవడం.. చనిపోతామనే భయంతో కేకలు వేయడం.. అటు తమ ప్రాణాలు పోతాయని తెలియక ఈ చదువయ్యాక ఏం చెయ్యాలనే విద్యార్థుల సంభాషణలు.. అన్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఐదు నిమిషాల నిడివితో వచ్చిన ఈ ఏఐ సినిమా సింప్లీ సూపర్‌గా ఉందనేలా చేస్తున్నాయి.






