అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై వెలుగులోకి షాకింగ్ వీడియో!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-06-20 15:31:09  IST  )

అహ్మ‌దాబాద్ ప్ర‌మాదం ప్ర‌పంచంలో జ‌రిగిన ఘోర విమాన ప్ర‌మాదాల్లో ఒక‌టిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో 270 మంది మ‌ర‌ణించారు.

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై వెలుగులోకి షాకింగ్ వీడియో!
X

దిశ, వెబ్ డెస్క్: అహ్మ‌దాబాద్ ప్ర‌మాదం ప్ర‌పంచంలో జ‌రిగిన ఘోర విమాన ప్ర‌మాదాల్లో ఒక‌టిగా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో 270 మంది మ‌ర‌ణించారు. మ‌ర‌ణించిన‌వారిలో 240 మంది ప్ర‌యాణికులు కాగా మిగితా వాళ్లలో విమానం కూలిపోయిన బీజే మెడిక‌ల్ కాలేజీ హాస్ట‌ల్ భ‌వ‌నంలోని వారు ఉన్నారు. అయితే ఇప్ప‌టికే ఘ‌ట‌న‌కు సంబంధించి కొన్ని భ‌యాన‌క వీడియోలు వైర‌ల్ అవ్వ‌గా తాజాగా మ‌రో వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది.

విమానం భ‌వ‌నంపై ప‌డిన స‌మ‌యంలో విద్యార్థులు వెంట‌నే ఎలా ప‌రుగులు తీశారో వీడియోలో క‌నిపిస్తుంది. భ‌వ‌నంలో మంట‌లు చెల‌రేగ‌డంతో విద్యార్థులు అంతా బాల్క‌నీల నుండి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ క్ర‌మంలో ప‌లువురు గాయ‌ప‌డ్డారు. ప్రాణ భ‌యంతో విద్యార్థులు ప‌రుగులు తీశారు. కొంద‌రు విద్యార్థులు బెడ్‌షీట్లను తాడుగా మార్చుకుని కింద‌కు దిగారు. మ‌రికొంద‌రు రీలింగ్ ప‌ట్టుకుని కింద ఫ్లోర్ పైకి నేరుగా దూకేశారు. వీడియో వైర‌ల్ అవ్వ‌డంతో నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు.

Tweet video

Next Story