వయస్సు కేవలం సంఖ్యే! స్కూటర్‌పై 86 ఏళ్ల బామ్మలు జల్సా.. నెట్టింట్లో వైరల్

by Yella Dhawani Reddy |

చాలా మంది వృద్ధాప్యంలో (old age) ఊతం లేకుండా నడవడమే కష్టంగా భావిస్తారు.

వయస్సు కేవలం సంఖ్యే! స్కూటర్‌పై 86 ఏళ్ల బామ్మలు జల్సా.. నెట్టింట్లో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: చాలా మంది వృద్ధాప్యంలో (old age) ఊతం లేకుండా నడవడమే కష్టంగా భావిస్తారు. వారి శరీరంలో శక్తి పూర్తిగా సన్నగిల్లి, నిలబడలేక, కూర్చోలేక ప్రతి అవసరానికి మరొకరిపై ఆధారపడుతుంటారు. అందుకే ఒంట్లో శక్తి ఉన్నప్పుడే జీవితాన్ని ఎంజాయ్ (Enjoy) చేయాలని చెబుతుంటారు. కానీ, వయస్సు కేవలం సంఖ్యే అని మరోసారి నిజం చేశారు ఈ బామ్మలు. అహ్మదాబాద్‌కు (Ahmedabad) చెందిన 86 ఏళ్ల ఈ బామ్మలు (Grany).. వయసుతో సంబంధం లేకుండా ఎంచక్కా స్కూటర్‌పై షికార్లకు వెళ్తూ జీవితాన్ని హ్యాపీగా గడిపేస్తున్నారు. ప్రస్తుతం వీరి వీడియో నెట్టింట్లో తెగ సందడి చేస్తోంది.

అహ్మదాబాద్‌కు చెందిన 86 ఏళ్ల మందాషా, 83 ఏళ్ల ఉషా షా అక్కాచెల్లెల్లు. వీరిని స్థానికులు బాలీవుడ్ హిట్ మూవీ షోలే సినిమాలోని జై, వీరూ‌లుగా పిలుస్తారు. అందుకు కారణం.. ఎంచక్కా ఇద్దరూ స్కూటీ రైడ్ చేసుకుంటూ సిటీ అంతా షికార్లు కొడుతుండటం. మందాషా స్కూటీ డ్రైవ్ చేస్తుంటే, ఉషా షా పక్కన క్యారేజీలో కూర్చుంటుంది. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. మందాషా తన 62 ఏళ్ల వయసులో స్కూటర్ నడపటం నేర్చుకున్నారు. రద్దీ రోడ్లపై ఎలాంటి బెరుకు లేకుండా అద్భుతంగా రయ్.. రయ్.. అంటూ ఆమె డ్రైవ్ చేస్తుంటే ఇతర వాహనదారులు సైతం ఆశ్చర్యపోతుంటారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral) మారటంతో.. నెటిజన్లు బామ్మలను పొగిడేస్తున్నారు. 'ఇంత జోష్, ఇంత ఉత్సాహం ఎక్కడి నుంచి వస్తోంది బామ్మా?', నేటితరం యువతకు మీరెంతో ఆదర్శం అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Next Story