- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పిన్నితో వివాహేతర సంబంధం.. సంచలనం రేపుతున్న ఘటన
ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో కుటుంబ విలువలకు మచ్చ తెచ్చే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు వరుసకు పిన్ని అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన బాబాయి భార్యకు అట్రాక్ట్ అయిన వ్యక్తి..

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో కుటుంబ విలువలకు మచ్చ తెచ్చే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు వరుసకు పిన్ని అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన బాబాయి భార్యకు అట్రాక్ట్ అయిన వ్యక్తి.. శారీరక సంబంధం వరకు వెళ్లాడు. కానీ ఆ తర్వాత దూరం పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో పిన్ని అతనిపై అత్యాచార ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. దీంతో ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు పిలవగా.. కథలో కీలక మలుపు చోటు చేసుకుంది. కలిసి జీవిస్తామని పోలీసుల సమక్షంలో గాంధర్వ వివాహం చేసుకున్నారు. దండలు మార్చుకున్నారు.
కానీ బాధిత భర్త ఎవరు లేని వాడిని అయిపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. సొంత అన్న కొడుకు, భార్య కలిసి మోసం చేశారని.. వాళ్లు ఎటుపోయినా ఇక తాను పట్టించుకోనని బాధపడ్డాడు. జీవితంలో ఇంతకు మించిన బాధ మరొకటి ఉండదంటూ కన్నీరు పెట్టుకున్నాడు. మరోవైపు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా గాంధర్వ వివాహం చట్టప్రకారం చెల్లుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.






