పందుల బతుకే బెటర్.. ఏకంగా ఏసీలు పెట్టి మరీ

by velandi.Saikiran |   (  Updated:2025-08-09 07:23:09  IST  )

ఓ వ్యక్తి... పెద్ద సాహసమే చేశారు. పందుల కోసం ప్రత్యేకంగా షెడ్డు వేసి... వాటికి ఏసీని కూడా ఏర్పాటు చేశాడు.

పందుల బతుకే బెటర్.. ఏకంగా ఏసీలు పెట్టి మరీ
X

దిశ, వెబ్ డెస్క్ : జంతువులు అంటే చాలా ఇష్టపడే వారు ఉంటారు. కొంతమంది కుక్కలను పెంచుకొని.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది కుందేళ్లు, పావురాలు, పిల్లలను కూడా పెంచుకుంటారు. ఇక పల్లెటూర్లలో.. ఆవులు అలాగే మేకలను పెంచుకొని జీవనం కొనసాగిస్తారు. ఇక మరి కొంతమంది తమ జీవనోపాధి కోసం పందులను కూడా పెంచుకుంటూ ఉంటారు.

ఇండియాలో పందులకు మంచి డిమాండ్ ఉంది. పందిలో ఉండే ఓ బాగా మెడిసిన్ లో బాగా ఉపయోగపడుతుందట. ఈ నేపథ్యంలోనే ఇండియా వ్యాప్తంగా పందుల పెంపకం విపరీతంగా పెరిగింది. అయితే ఈ పందులను పెంచేందుకు చిన్నచిన్న గుడిసెలు... లేదా డేరాలు వేసి పెంచుతూ ఉంటారు. చల్లటి గాలి తగిలేలా ఉంచుతారు.

అయితే తాజాగా ఓ వ్యక్తి... పెద్ద సాహసమే చేశారు. పందుల కోసం ప్రత్యేకంగా షెడ్డు వేసి... వాటికి ఏసీని కూడా ఏర్పాటు చేశాడు. ఇండియాలో చాలా మందికి అసలు ఏసీ అంటేనే తెలీదు. కానీ పందుల కోసమే ప్రత్యేకంగా ఏసీ కూడా ఏర్పాటు చేశాడు సదరు వ్యక్తి. ఇక ఆ ఏసీ నుంచి వచ్చే చల్లటి గాలిని ఆస్వాదిస్తూ పందులు కూడా... ఎంజాయ్ చేస్తున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన నేటిజన్స్... అదిరిపోయో ఆలోచన అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Instagramme Link

Next Story