మృతదేహం నుంచి వీర్యం సేకరణ.. డజన్ల కొద్దీ పిల్లలకు జన్మనిచ్చిన మహిళలు

by Sujitha Rachapalli |

ఇజ్రాయెల్‌లో 35 ఏళ్ల డాక్టర్ హదాస్ లెవీ తన భర్త కెప్టెన్ నెతన్యేల్ సిల్‌బర్గ్ మరణించిన 18 నెలల తర్వాత ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ప్రక్రియలో మరణానంతరం వీర్యం సేకరణ (postmortem sperm retrieval) సాంకేతికత ఉపయోగించబడింది.

మృతదేహం నుంచి వీర్యం సేకరణ..  డజన్ల కొద్దీ పిల్లలకు జన్మనిచ్చిన మహిళలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఇజ్రాయెల్‌లో 35 ఏళ్ల డాక్టర్ హదాస్ లెవీ తన భర్త కెప్టెన్ నెతన్యేల్ సిల్‌బర్గ్ మరణించిన 18 నెలల తర్వాత ఒక కుమారుడికి జన్మనిచ్చింది. ఈ ప్రక్రియలో మరణానంతరం వీర్యం సేకరణ (postmortem sperm retrieval) సాంకేతికత ఉపయోగించబడింది. కెప్టెన్ నెతన్యేల్ సిల్‌బర్గ్ 2023 డిసెంబర్ 18న గాజాలో యుద్ధంలో మరణించాడు. అయితే ఆయన వంశం ఆగిపోకుండా ఉండేందుకు అతని భార్య హదాస్ సంచలన నిర్ణయం తీసుకుంది. మరణించిన భర్త వీర్యాన్ని పోస్ట్‌మార్టమ్ స్పెర్మ్ రిట్రైవల్ ద్వారా సేకరించాలని ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు గవర్నమంట్ అంగీకరించడంతో.. స్మెర్మ్ సేకరించారు. అక్కడ తరుచుగా ఇది జరుగుతుంది. మరణించిన వ్యక్తి అనుమతి ఇవ్వకపోయినా.. కొద్ది సార్లు తల్లిదండ్రులు, భార్య, దీర్ఘకాలిక భాగస్వామి ఇలా వీర్యం సేకరణకు అనుమతి కోరవచచు. ఈ విధానం ద్వారా ఇప్పటికే ఆ దేశంలో డజన్ల కొద్దీ పిల్లలు జన్మించారు.

ఈ టెక్నాలజీ గురించి..

* మరణానంతరం వీర్యం సేకరణ 2003 నుంచి ఇజ్రాయెల్‌లోపూర్తిగా చట్టబద్ధం.

* తల్లిదండ్రులు, భాగస్వామి, పార్టనర్ ఇందుకు అనుమతి కోరవచ్చు.

* మరణం తర్వాత 24 నుంచి 36 గంటల్లోపు వీర్య సేకరణ జరగాలి.

* ఇజ్రాయెల్ ఆర్మీ.. యుద్ధంలో మరణించిన సైనికుల శరీరాలను త్వరగా ఆస్పత్రికి చేర్చి.. కుటుంబం అనుమతి కోసం వేచి ఉండకుండా తరచూ సేకరణ చేసి ఫ్రీజ్ చేస్తుంది. తర్వాత కోర్టు అనుమతి తీసుకుంటారు.

* మరణం తర్వాత వీర్య నాళాలు (vas deferens) లేదా వృషణాల నుంచి సూది ద్వారా లేదా శస్త్రచికిత్స ద్వారా వీర్య కణాల సేకరణ జరుగుతుంది. ల్యాబ్‌లో వీర్యకణాలు (spermatozoa) లేదా వృషణ కణజాలం నుంచి కణాలు వేరుచేసి క్రయోప్రిజర్వేషన్ చేస్తారు. వీటిని భవిష్యత్తులో IVF + ICSI ద్వారా గర్భం పొందేందుకు వినియోగిస్తారు.

* అయితే మరణించిన వ్యక్తి తండ్రి కావాలనుకున్నాడా? తండ్రి లేకుండా పిల్లలు పెరగడం మంచిదేనా? మృతుడి శరీరాన్ని ఓ వస్తువుగా మారుస్తున్నారా? అనే విమర్శలు కూడా వస్తున్నాయి.

Next Story