అద్భుతం... సముద్రంపై కనువిందు చేస్తున్న అరుదైన మంచు పుష్పాలు.. (వీడియో)

by Sujitha Rachapalli |   (  Updated:2025-09-10 03:52:28  IST  )

సోషల్ మీడియాలో ఓ అద్భుత వీడియో వైరల్ అవుతోంది. చలికాలంలో ఆర్కిటిక్ మహాసముద్రం ఉపరితలంపై పుష్పాలు విరబూసినట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నట్లుగా ఉంది. శీతాకాలంలో అతి చల్లగా ఉండడం వల్ల నీటిలోని ఉప్పు కణాలు దగ్గరగా చేరి..

అద్భుతం... సముద్రంపై కనువిందు చేస్తున్న అరుదైన మంచు పుష్పాలు.. (వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : సోషల్ మీడియాలో ఓ అద్భుత వీడియో వైరల్ అవుతోంది. చలికాలంలో ఆర్కిటిక్ మహాసముద్రం ఉపరితలంపై పుష్పాలు విరబూసినట్లుగా కనిపిస్తున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నట్లుగా ఉంది. శీతాకాలంలో అతి చల్లగా ఉండడం వల్ల నీటిలోని ఉప్పు కణాలు దగ్గరగా చేరి.. మంచు ఉపరితలంపై ఇలా పువ్వుల మాదిరిగా కనిపిస్తాయి. ఇక ఇవి త్వరగా అదృశ్యమయ్యే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే ఇలా పువ్వుల మాదిరిగా మారేందుకు కణాలు దగ్గరగా చేరాల్సిన అవసరం ఉంది. అతి చల్లని గాలి, కొంత మేరకు వెచ్చని సముద్రం, శాంతమైన పరిస్థితులు మాత్రమే ఇందుకు కారణమవుతాయి. చిన్నగా గాలి రావడం, సూర్యకాంతి కొద్దిగా పడినా సులభంగా కణాలు దూరమై విడిపోతాయి. వాటి రూపాన్ని కోల్పోతాయి. సముద్ర మంచుపైన ఏర్పడే ఈ ఫ్రాస్ట్ ఫ్లవర్స్.. అధిక లవణత, రసాయన సాంద్రతలను కలిగి ఉంటాయి. జలవాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తాయి.

Link

Next Story