- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరల్ వీడియో ఘటనపై క్లారిటీ ఇచ్చిన HDFC ఉద్యోగిని ఆస్తా సింగ్.. కీలక వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ ఉద్యోగిని ఆస్తా సింగ్ బ్యాంక్ ఆవరణలో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపిన విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంక్ ఉద్యోగిని ఆస్తా సింగ్ బ్యాంక్ ఆవరణలో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన వీడియో సోషల్ మీడియాలో దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై తాజాగా ఆస్తా సింగ్ స్పందించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని, తాను గొడవ పడింది బ్యాంకు కస్టమర్‌తో కాదని ఆమె క్లారిటీ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..?
కాన్పూర్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్రాంచ్‌లో ఆస్థా సింగ్ ఒక వ్యక్తితో తీవ్ర వాగ్వాదానికి దిగిన వీడియో ఇటీవల వెలుగులోకి వచ్చింది. అందులో ఆమె బూతులతో రెచ్చిపోతూ, అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించడం కనిపించింది. ‘నేను ఠాకూర్‌ని, నాతో పెట్టుకోవద్దు.. నిన్ను నాశనం చేస్తా’ అంటూ కులాన్ని ప్రస్తావిస్తూ బెదిరించడం, కోపంతో డెస్క్‌పై ఉన్న లాప్‌టాప్‌ను ఎత్తి విసరబోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తోటి సిబ్బంది వారించినా ఆమె శాంతించకపోవడంతో, బ్యాంకింగ్ రంగంలో ఉంటూ ఇలా ప్రవర్తించడం, కుల వివక్ష వ్యాఖ్యలు చేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆస్తా సింగ్ వివరణ..
ఈ విమర్శల నేపథ్యంలో ఆస్తా సింగ్ స్పందిస్తూ.. ‘ఈ ఘటనను తప్పుగా చిత్రీకరించారు. దీనికి ఏ కస్టమర్‌తోనూ సంబంధం లేదు. గొడవ పడింది నా సహోద్యోగి భర్తతో. అతను నాతో అసభ్యంగా ప్రవర్తించాడు, ఆ ప్రవర్తనకు ప్రతిచర్యగానే నేను అలా స్పందించాల్సి వచ్చింది. ఇక కులం ప్రస్తావన విషయానికొస్తే.. నన్ను అడిగారు కాబట్టే నేను చెప్పాను. నేను ఠాకూర్‌ని, ఆ విషయంలో గర్వపడుతున్నాను. నేను ఉద్దేశించిన ఆ సహోద్యోగి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు. దురదృష్టవశాత్తు ఈ విషయానికి వేరే రంగు పులిమారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వల్ల నా పరువుకు భంగం కలిగింది, దీనిపై కచ్చితంగా న్యాయపరమైన చర్యలు తీసుకుంటాను’ అని ఆమె పేర్కొన్నారు.






