Karnataka : లవర్ తో లేచిపోయిన యువతి... కుటుంబం మొత్తం సూసైడ్

by Muthe.Rajitha |

కూతురు ప్రేమించిన వాడితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు, ఆమె సోదరి చెరువులో దూకి సూసైడ్(Family Suicide) చేసుకోవడం సంచలనం రేపింది.

Karnataka : లవర్ తో లేచిపోయిన యువతి... కుటుంబం మొత్తం సూసైడ్
X

దిశ, వెబ్ డెస్క్ : కూతురు ప్రేమించిన వాడితో వెళ్లిపోవడాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు, ఆమె సోదరి చెరువులో దూకి సూసైడ్(Family Suicide) చేసుకోవడం సంచలనం రేపింది. ఈ విషాద ఘటన కర్ణాటక(Karnataka)లోని మైసూరులో చోటు చేసుకుంది. మహాదేవస్వామి-మంజుల దంపతులకు అర్పిత, హర్షిత అనే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. బాగా చదివించి కూతుళ్లను ఉన్నత స్థానంలో చూడాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. అయితే పెద్ద కుమార్తె అర్పిత ఓ అబ్బాయిని ప్రేమించింది. ఆ విషయం ఇంట్లో తెలిసి ఆమెను మందలించారు. అయితే అమ్మానాన్న చెప్పిన వినకుండా అర్పిత తాను ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోయింది.

తాము ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఇంట్లోంచి చెప్పా పెట్టకుండా ప్రేమించిన అబ్బాయితో వెళ్లడాన్ని జీర్ణించుకోలేని ఆ తల్లిదండ్రులు, మరో కుమార్తె హర్షితతోసహ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విచారణ జరుపుతున్నారు.

Next Story