కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు? యువతి చెప్పిన 18 పాయింట్ల లిస్ట్ చూసి యువకులు షాక్!

by Ramesh Naini |   (  Updated:2025-04-19 07:34:41  IST  )

తనకు కాబోయే భర్త అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ అమ్మాయిలు ఏవేవో కలలు కంటుంటారు.

కాబోయే భర్తకు ఉండాల్సిన లక్షణాలు? యువతి చెప్పిన 18 పాయింట్ల లిస్ట్ చూసి యువకులు షాక్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తనకు కాబోయే భర్త (husband should be like) అలా ఉండాలి.. ఇలా ఉండాలి అంటూ అమ్మాయిలు ఏవేవో కలలు కంటుంటారు. తన జీవిత భాగస్వామికి అందంతోపాటు చదువు, ఆదాయం, వ్యక్తిగత గుణాలు, మంచి అలవాట్లు కలిగిన వాడైతేనే ఇష్టపడుతున్నారు నేటి అమ్మాయిలు. ఈ నేపథ్యంలోనే ఓ యువతి తనకు కాబోయే మొగుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలో ఏకంగా 18 పాయింట్ల లిస్ట్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన లిస్ట్ చూసి పెళ్లీ కానీ అబ్బాయిలు షాక్‌కు గురవుతున్నారు.

ఫైరల్ అవుతున్న లిస్ట్ ప్రకారం.. యువతితో ఓ అబ్బాయి చాట్ చేస్తాడు. ఇప్పుడే మీ ప్రొఫైల్ చూశానని, అబ్బాయి లక్షణాలకు సంబంధించిన చెక్ లిస్ట్ చెప్పమని అడుగుతాడు. అందుకు యువతి హాహా అని నవ్వుతూ.. నువ్వు చూడాలనుకుంటున్నావా? అని ప్రశ్నిస్తోంది. దానికి అవును.. అని యువకుడు బదులిస్తాడు. ఈ క్రమంలోనే (18 points that a future husband) యువతి 18 పాయింట్లతో యువతి లిస్ట్ పంపుతోంది. ఈ చాట్ లిస్ట్‌ను రెడ్డిట్ సమాజిక మాధ్యమం ద్వారా టిండర్ డేటింగ్ యాప్ పోస్ట్ చేస్తోంది. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది చూసిన సగానికిపైగా యూజర్లు షాకింగ్‌కు గురయ్యారు. ఇలాంటి కోరికలు ఉంటే తను లైఫ్ లాంగ్ సింగిల్‌గానే ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది మాత్రం తనకు అలాంటి అబ్బాయి దొరకాలని విషెస్ చెబుతున్నారు. ఇలాంటి వారికి పక్కాగా జులాయి గాడే దొరుకుతాడని ఓ నెటిజన్ విమర్శించారు. ఇవన్నీ చెప్పే బదులు తనకు ఒక బానిస కావాలని ఒక్క ముక్కలో చెప్తే అయిపోతుందని ఓ నెటిజన్ కామెంట్ ఆసక్తికరంగా మారింది.

మినిమమ్ ఈ లక్షణాలు కలిగి ఉండాలి

1. నేనే తనకు ఫస్ట్, లోతుగా ప్రేమించాలి

2. ఫైనాన్స్‌గా సక్సెస్, జీతం $300k(రూ.2.5 కోట్లు) ఉండాలి

3. ఉదార స్వభావం

4. అదునాతన, లగ్జరీని ఎంజాయ్ చేయాలి

5. కాన్ఫిడెంట్, మానసికంగా తెలివైనవాడు

6. ధైర్యం, ప్రొటెక్ట్ చేసేవాడు

7. క్రమశిక్షణ ఉండాలి

8. ఫ్యామిలీ పర్సన్, అందరితో కలిసిపోయే వాడు

9. ఫిట్‌నెస్, ఆకర్షణీయైన చక్కటి ఆహార్యం

10. ప్రణాళిక, నియంత్రణ కలిగి ఉండాలి

11. విలువలు, మాట నిలబెట్టుకునే తత్వం

12. నా లైఫ్ స్టైల్, నా లక్ష్యాలకు సపోర్ట్ ఇవ్వాలి

13. సరదా, బయట తిరగాలి, సామాజికంగా గౌరవం

14. సోషల్ మీడియా కంటే తన ప్రైవసీకి ప్రాధాన్యత ఇవ్వాలి

15. ట్రావెలింగ్ ఇష్టముండాలి, సరైన భోజనం తినాలి

16. లైంగిక క్రమశిక్షణ, (విధేయత) లాయల్‌గా ఉండాలి

17. గర్భనిరోధక చర్యలు (నాకు హార్మోన్లు వద్దు)

18. జీవితం సులభంగా ఉండాలి (పని పనిషి, చెఫ్ మొదలైనవి)

Next Story