- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేవలం రూ.7వేలతో ఫ్లయింగ్ ప్లేన్ తయారు చేసిన యువకుడు...వీడియో వైరల్
by Ajay Maddhiboyina |
కేవలం 7వేల రూపాయలతోనే ఓ యువకుడు ఫ్లయింగ్ ప్లేన్ తయారు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: కేవలం 7వేల రూపాయలతోనే ఓ యువకుడు ఫ్లయింగ్ ప్లేన్ తయారు చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బిహార్‌కు చెందిన అవనిష్ కుమార్ ఈ ప్లేన్ తయారు చేశాడు. దీని కోసం అతడు పనికిరాని వస్తువులను ఉపయోగించినట్టు చెబుతున్నాడు. అంతే కాకుండా కేవలం వారం రోజుల్లోనే తయారు చేసినట్టు చెప్పాడు. ఈ ప్లేన్ 300 మీటర్ల ఎత్తు వరకు ఎగరుతుందని అన్నాడు. అందరి ముందు ఓ గ్రౌండ్‌లో అవనిష్ ప్లేన్ ఎగరవేయగా అచ్చం విమానం మాదిరిగానే అది గాల్లోకి ఎగిరింది. అంతే కాకుండా దానిని చాలా సింపుల్ గా అవనిష్ డ్రైవ్ చేస్తూ తిరిగి ల్యాండ్ చేశాడు. ప్లేన్ తయారు చేసిన యువకుడిని గ్రామస్థులంతా అభినందిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు సైతం అతడి టాలెంట్ కు ఫిదా అవుతున్నారు. VIDEO
Next Story






