- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీడు సామాన్యుడు కాదబ్బా!.. బుడ్డోడి టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా
"ప్రతిభకు వయసుతో సంబంధం లేదు.. టాలెంట్ ఎవరి సొత్తు కాదు" అనే మాటలకు నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: "ప్రతిభకు వయసుతో సంబంధం లేదు.. టాలెంట్ ఎవరి సొత్తు కాదు" అనే మాటలకు నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమై, ప్రయాణం నరకప్రాయంగా మారిన వేళ.. ఒక చిన్నారి బాలుడు తన అద్భుతమైన తెలివితేటలతో చేసిన ప్రయోగం నెటిజన్లను ఫిదా చేస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఒక ప్రాంతంలో రోడ్డు మొత్తం మోకాలోతు నీటితో నిండిపోయి, ఒక చెరువును తలపించింది. సాధారణ ప్రజలు, వాహనదారులు ఆ నీటిని దాటడానికి తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అయితే అక్కడే ఉన్న ఒక బుడ్డోడు మాత్రం అస్సలు కంగారు పడలేదు. నీటిలో తడవకుండా రోడ్డు దాటడానికి ఒక క్రేజీ ఐడియా వేశాడు.
తన ఇంట్లో ఉన్న నాలుగు పెంపుడు కుక్కలను కలిపి.. ఒక చిన్న తోపుడు బండికి కట్టాడు. పాతకాలపు గుర్రపు బండి (టాంగా) లేదా మంచు ప్రాంతాల్లో తిరిగే స్లెడ్జ్ బండి తరహాలో ఒక 'డాగ్ కార్ట్'ను సిద్ధం చేశాడు. ఆ బండిపై రాజాలా కూర్చొని. ఆ నాలుగు కుక్కల సహాయంతో చాలా సులభంగా, స్టైల్‌గా ఆ వరద నీటిని దాటేశాడు. ఆ బుడ్డోడి ఐడియాకు, ఆ కుక్కలు చూపించిన క్రమశిక్షణకు రోడ్డుపై వెళ్లేవారంతా నోరెళ్లబెట్టారు. ఈ వినూత్న దృశ్యాన్ని అక్కడ ఉన్న కొందరు మొబైల్ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బుడ్డోడి సమయస్ఫూర్తిని, తెలివితేటలను తెగ మెచ్చుకుంటున్నారు. "బుడోడి ప్లాన్ అదిరిపోయింది.. వీడు ఫ్యూచర్ ఇంజినీర్ బాస్", "కుక్కలు కూడా ఎంత బాగా కోఆపరేట్ చేశాయో!" అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది.






