ఫేమస్ కావడానికి ఇంత తెగింపా.. ఒంటిపై ఉన్న చీరను కూడా తగలబెట్టుకుందిగా.. ?

by velandi.Saikiran |

సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్దీ... జనాలు కూడా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో పాపులరారై ఒక్కరు డబ్బులు

ఫేమస్ కావడానికి ఇంత తెగింపా.. ఒంటిపై ఉన్న చీరను కూడా తగలబెట్టుకుందిగా.. ?
X

దిశ, వెబ్ డెస్క్:సోషల్ మీడియా వాడకం పెరిగిన కొద్దీ... జనాలు కూడా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో పాపులరారై ఒక్కరు డబ్బులు సంపాదించారని... వాళ్లను చూసి మరి కొంత మంది రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రకరకాల సాహసాలు చేస్తూ... సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. అందులో కొంత మంది సక్సెస్ అవుతుంటే.. మరికొంతమంది అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. అయితే తాజాగా ఓ మహిళ ( Women)... పాపులారిటీ కోసం.. ప్రాణాలకే తెగించింది.

తన చీర కొంగుకు.. మంట (Fire) పెట్టుకుని మరి వీడియోలు చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏపీలో ఓ గ్రామానికి చెందిన 35 సంవత్సరాల మహిళ.. నిత్యం సోషల్ మీడియాలో ( Social Media) వీడియోలు పెట్టేది. అయితే ఎలాంటి వీడియోలు పెట్టిన పాపులారిటీ దక్కకపోవడంతో.. ఈసారి కొత్తగా ఆలోచించింది. తన చీర కొంగుకు.. మంట పెట్టుకొని... డాన్స్ చేయడం మొదలు పెట్టింది. పాత తెలుగు సినిమా పాటకు... ఊర మాస్ స్టెప్పులు వేస్తూ.. రీల్స్ చేసింది. దీంతో ఆమె వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.

చీరకు మంట పెట్టుకోవడంతో... జనాలు కూడా చూసేందుకు ఆసక్తి చూపించారు. ఇప్పుడు ఈ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల్లో.. తెగ వైరల్ అవుతుంది. అయితే ఈ వీడియోని చూసిన నెటిజన్స్... దారుణంగా తిడుతూ కామెంట్స్ పెడుతున్నారు. ప్రాణాలకు తెగించి రీల్స్ చేయడం అవసరమా..? ఆంటీ వయసు వచ్చింది.. కొంచెం కూడా బుద్ధి లేదా అని ఫైర్ అవుతున్నారు. ఆమెను పిచ్చి ఆస్పత్రిలో జాయిన్ చేయాలని.. మరి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. వ్యూస్ కోసం ఇలా బరితెగించాలా ? నిన్ను చూసి మరో పదిమంది అలాగే చేస్తే పరిస్థితి ఏంటని.. దారుణమైన కామెంట్స్ పెడుతున్నారు.

twitter link

Next Story