Snake Waterfall : ఓర్నాయనో.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే ఎవరైనా..! ఆ జలపాతం వద్ద కనిపించిన దృశ్యాలను చూస్తే..

by Javid Pasha |   (  Updated:2025-08-20 13:26:16  IST  )

చూడగానే వామ్మో.. అనిపించేలా ఉన్న ఈ దృశ్యం ఇండోనేషియాలోని ఒక జలపాతానికి సంబంధించినదని వైరల్ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

Snake Waterfall : ఓర్నాయనో.. ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే ఎవరైనా..! ఆ జలపాతం వద్ద కనిపించిన దృశ్యాలను చూస్తే..
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచంలో మనల్ని అలరించే అందమైన ప్రదేశాలే కాదు, ఒళ్లు జలదరించే భయంకరమైన ప్రకృతి దృశ్యాలు సైతం ఉన్నాయి. అలాంటి ఓ వీడియోనే ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతూ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. చూడగానే వామ్మో.. అనిపించేలా ఉన్న ఈ దృశ్యం ఇండోనేషియా(Indonesia)లోని ఒక జలపాతానికి సంబంధించినదని వైరల్ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీనినే స్నేక్ వాటర్ ఫాల్ (Snake Waterfall ) అని కూడా పిలుస్తారు. పేరుకు తగ్గట్టే ఆ జలపాతంలో, పరిసరాల్లో మనల్ని కాటేయడానికో, మింగడానికి సిద్ధంగా ఉన్న పాములకు సంబంధించిన దృశ్యాలు కనిపిస్తాయి.

వైరల్ ఇన్ఫర్మేషన్ (Viral video) ప్రకారం.. అవి నిజమైన పాములు మాత్రం కావు. ఆ వీడియో బాలిలో షూట్ చేయగా.. అందులో కనిపిస్తున్న వాటర్ ఫాల్‌ను ‘బేజీ గ్రియా వాటర్ ఫాల్’ అంటారు. ఇది ఉబుద్‌కు దగ్గరలోని ఒక పర్యాటక ప్రదేశం. ఇక్కడి జలపాతాన్ని చూసేందుకు టూరిస్టులు వస్తుంటారు. దాని అందమైన, వింతైన భౌతిక పరిస్థితి, అలాగే ఆ జలపాతంలోని రాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఎందుకంటే ఈ రాళ్లు అచ్చం పాములు, అనకొండలను పోలి ఉంటాయి. అయితే ఇవి నిజమైన పాములు కావు, నిజమైన రాళ్లు కూడా కావు. స్థానిక కళాకారులు తయారు చేసిన శిల్పాలు. వాటిపై నీళ్లు పారీ పారీ.. నాచు, ఆల్గే వంటివి పేరుకపోవడంతో, అసలుకే పాముల మాదిరి ఉండే ఈ శిల్పాలు మరింత భయానకంగా అనిపిస్తుంటాయి. ‘Amazing Nature’ అనే ఎక్స్ వేదికగా షేర్ చేయబడిన ఈ వీడియో నెటిజన్లలో క్యూరియాసిటీ పెంచుతోంది. Video link

Next Story