Viral Video : రోడ్ సైడ్ పకోడీలు లొట్టలేసుకుంటూ తింటున్నారా..? ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేసుకోండి.. తర్వాత ఏం జరుగుతుందో..!!

by Javid Pasha |   (  Updated:2025-08-07 06:32:15  IST  )

Viral Video : రోడ్ సైడ్ పకోడీలు లొట్టలేసుకుంటూ తింటున్నారా..? ఈ వీడియో చూసి మీరే డిసైడ్ చేసుకోండి.. తర్వాత ఏం జరుగుతుందో..!!

Viral Video : రోడ్ సైడ్ పకోడీలు లొట్టలేసుకుంటూ తింటున్నారా..? ఈ వీడియో చూసి మీరే డిసైడ్  చేసుకోండి.. తర్వాత  ఏం జరుగుతుందో..!!
X

దిశ, ఫీచర్స్ : ఇంట్లో వండే హెల్తీ ఫుడ్స్ కంటే.. మనలో చాలా మందికి బయట రోడ్ సైడ్ స్నాక్స్ అంటేనే మహా ఇష్టం. ఇక పకోడీలు, సమోసాలు, పావ్ బజ్జీలైతే చెప్పనవసరం లేదు. లొట్టలేసుకుంటూ మరీ లాగించేస్తుంటాం. మస్తు టేస్టీగా ఉన్నాయని మురిసిపోతుంటాం. కానీ ఇవి ఆరోగ్యానికి ఎంత డేంజరో తెలుసా? ఇది గుర్తు చేసే వీడియో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చూశారంటే.. బయట స్నాక్స్ తినాలంటేనే ఆలోచిస్తారేమో.. !

వైరల్ సమాచారం ప్రకారం.. అది ముంబైలోని ఒక రద్దీ ఏరియా.. రోడ్డు పక్కన వీధిలో ఒక స్నాక్స్ ఛాట్ ఉండగా.. అక్కడొక వ్యక్తి పకోడీలు, సమోసాలు, మర్చీ బజ్జీలు, బేల్ పూరీలు నూనెలో వేయిస్తున్నాడు. అయితే ఈ సందర్భంగా అతను చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే.. అతను ప్లాస్టిక్ ఆయిల్ ప్యాకెట్లను కట్‌ చేసి, నూనె కడాయిలో వేయాల్సింది పోయి.. అప్పటికే మరుగుతున్న నూనెలో వాటిని నేరుగా ముంచాడు. అలా ముంచినప్పుడు వేడికి అవి కరిగిపోయి వాటిలోని నూనె కడాయిలో పడుతుందనేది అతని ఐడియా.

నూనె ప్యాకెట్లను మరుగుతున్న కడాయిలో ముంచడం ఆరోగ్యానికి హానికరమని భావించిన ఒక వ్యక్తి సదరు దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘ప్లాస్టిక్ పౌచ్‌లను వేడి నూనెలో ఎలా ముంచుతున్నాడో చూడండి. రూ. 10, 20 కి వస్తాయని మనం వీటిని తింటే.. ఆరోగ్యానికి ఎంత హానికరమో మీరే ఆలోచించండి’ అంటూ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. శుభ్రత, ఆరోగ్యపరమైన నిబంధనలు పాటించని చోట్ల చేసిన ఇలాంటి స్నాక్స్ తింటే క్యాన్సర్, హార్మోన్ల అసమతుల్యత, టీబీ వంటి రోగాలు వస్తాయని నెటిజన్లు, నిపుణులు సైతం పేర్కొంటున్నారు. ఎందుకంటే.. ప్లాస్టిక్ కవర్లను నూనెలో ముంచడంవల్ల అవి విషపూరిత కెమికల్స్‌ను రిలీజ్ చేస్తాయి. Link

Next Story