- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎంతకు తెగించార్రా అసలు.. వద్దు.. వద్దు అని అరుస్తున్నా యువతిని కాంపౌండ్‌లోకి లాక్కెళ్లిన యువకుడు..!
ఎంతకు తెగించార్రా అసలు..! వద్దు.. వద్దు అని అరుస్తున్నా యువతిని కాంపౌండ్‌లోకి లాక్కెళ్లి యువకుడు..!

దిశ, ఫీచర్స్ : పట్ట పగలు.. నట్ట నడిరోడ్డుపై ఓ యువతితో దారుణంగా ప్రవర్తించాడు ఓ యువకుడు. ఆమెను చేతులతో పట్టుకొని లాక్కెళ్లాడు. తప్పెవరిదో, కారణమేంటో తెలియదు కానీ పరిస్థితి చూస్తుంటే ఆమెను వేధిస్తున్నట్లున్నాడు. దీంతో ఆ యువతి గట్టిగా అరుస్తోంది. అయితే అంతలోనే ఆ యువకుడు ఆమెను అక్కడున్న ఓ కాంపౌండ్‌లోకి లాక్కెళ్లాడు. ఆమె వద్దు వద్దు అని అరుస్తున్నా వినకుండా తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ ఒకరినొకరు నెట్టుకోవడం, పెనుగులాడుకోవడం చూస్తుంటే ఏదో పెద్ద ఇష్యూ జరిగినట్టుంది.
వైరలవుతున్న వీడియో ప్రకారం.. యువతీ యువకుడు ఘర్షణ పడుతున్న సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, లక్నోలోని గోమతినగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. ఠాణాకు దగ్గరలోని రోడ్డుపై యువతీ యువకుడు ఒకరినొకరు నెట్టుకుంటూ, తిట్టుకుంటూ అరుస్తూ గొడవకు దిగారు. తన ఫోన్ ఇవ్వాలని యువతి గట్టిగా అరుస్తోంది. యువకుడు కూడా ఏదో చెబుతూ అరుస్తున్నాడు. ఇద్దరూ పరస్పరం దాడిచేసుకుంటున్నారు. చివరికి యువకుడు ఆ యువతి చేతులు పట్టుకొని పోలీస్ స్టేషన్ బోర్డు కనిపిస్తున్న కాంపౌండ్‌లోకి లాక్కెళ్లాడు. వీడియోలో ఓ పోలీస్ కూడా కనిపించాడు. బహుశా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చేందుకు వెళ్లి ఉంటారు. అయితే ఇక్కడ యువకుడు యువతిని లాక్కెళ్లడంతో ఆమెను వేధించినట్లు అర్థం అవుతోంది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






