తెలివి అంటే ఇదే...క‌రెంట్ లేకున్నా మిష‌న్ కుట్టొచ్చు!

by velandi.Saikiran |

కరెంటు వాడకుండానే మిషన్ కుట్టేయడం మొదలు పెట్టింది ఓ లేడీ.

తెలివి అంటే ఇదే...క‌రెంట్ లేకున్నా మిష‌న్ కుట్టొచ్చు!
X

దిశ‌, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మాత్రం చాలా భయానకంగా ఉంటాయి. ఇక మరికొన్ని వీడియోలు అయితే చాలా వింతగా కనిపిస్తూ ఉంటాయి. అయితే లేటెస్ట్ గా ఓ లేడీ చేసిన పని హాట్ టాపిక్ అయింది. కరెంట్ వాడకుండానే మిషన్ కుట్టేయడం మొదలు పెట్టింది ఓ లేడీ. ఇంట్లో ఉన్న స్కూటీ సహాయంతో ఈ అదిరిపోయే ప్లాన్ చేసింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రతి ఇంట్లో కుట్టు మిషన్ కచ్చితంగా ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ ప్రకారం అన్ని మిషన్లు కరెంట్ తోనే నడుస్తున్నాయి. అయితే ఓ మహిళ కరెంట్ సహాయం లేకుండానే కుట్టు మిషన్ నడిపిస్తోంది. మిషన్ కు టూ-వీలర్ వెహికల్ కు ఓ రబ్బర్ ద్వారా కనెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత బైక్ స్టార్ట్ చేసి ఎక్సలెటర్ నెమ్మదిగా ఇవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో మిషన్ కూడా తిరగడం ప్రారంభించింది. ప్లాన్ సక్సెస్ కావడంతో బట్టలు కూడా కుట్టేసింది ఆ లేడి. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన జనాలు ఫిదా అయిపోతున్నారు. పవర్ కట్స్ ఉన్నప్పుడు ఇలాంటి సాహసాలు చేస్తే వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చని కామెంట్ చేస్తున్నారు నెటిజెన్స్‌.

Next Story