- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆలయంలో ఆశ్చర్యకరమైన దృశ్యం.. విరాట్ పోలికలతో పూజారి.. నెట్టింట వైరల్!
ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్స్‌కు చేరడం అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది.

దిశ, వెబ్ గెస్క్: ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫైనల్స్‌కు చేరడం అభిమానుల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. క్రికెట్ ప్రేమికులంతా కోహ్లీ మ్యాజిక్‌ను మళ్లీ చూడటానికి ఉత్సాహంగా ఎదురుచూస్తుండగా.. ఒక్కసారిగా కోహ్లీ (Virat kohli) పూజారి వేషంలో దర్శనమిచ్చాడు. మైదానంలో బ్యాట్ పట్టుకుని కాకుండా ఆలయంలో ప్రసాదం పంచుతూ కోహ్లీ కనిపించాడంటే నమ్మశక్యంగానే ఉంటుంది. కానీ, ఒడిశాలోని (Odisha) ఓ ఆలయంలో నిజంగా అలా జరిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్‌గా మారింది. అయితే, వీడియోలో కనిపించే వ్యక్తి విరాట్ కోహ్లీ కాదు. ఆలయంలోని ఓ పూజారి కూడా అచ్చం అతడి రూపరేఖలతో ఉండటంతో ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని ప్రముఖ అనంత వాసుదేవ ఆలయంలో ఓ పూజారి విరాట్ కోహ్లీకి అసలైన డూప్‌లా కనిపించడం సంచలనం రేపుతోంది. ఆలయంలోని వంటశాలలో ప్రసాదం వడ్డిస్తున్న అతడి ముఖం, గడ్డం, నడక.. అన్నీ కోహ్లీని తలపిస్తున్నాయి. ఈ పూజారిని సడెన్‌గా చూసిన ఎవరైనా కోహ్లీ అనే అనుకుంటారు. ఇక ఆలయంలోని భక్తులు ఇందుకు సంబంధించిన వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది క్షణాల్లో వైరల్ అయింది. ఈ వీడియో నెటిజన్లు.. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'విరాట్ కోహ్లీ పూజారి ఎప్పుడు అయ్యాడు?' అంటూ కొందరు, 'RCB విజయంకోసం పూజలు చేస్తున్న కోహ్లీ?' అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
కాగా, ఇదే తరహాలో 2024 జనవరిలో అయోధ్యలోని రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా టీమిండియా జెర్సీ ధరించిన ఓ వ్యక్తి విరాట్ కోహ్లీలా కనిపించాడు. దీంతో అక్కడి భక్తులు అతన్ని చుట్టుముట్టి సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. ఆ వ్యక్తి కోహ్లీ డూప్ అని తెలిసినప్పటికీ, అభిమానులు అతనితో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు .






