- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
10 రోజుల క్రితం చనిపోయిన విద్యార్థిని.. కట్ చేస్తే పది ఫలితాల్లో జరిగింది ఇదే!
విధి ఆ విద్యార్థినితో వింత నాటకమాడింది.

దిశ, వెబ్‌డెస్క్: విధి ఆ విద్యార్థినితో వింత నాటకమాడింది. బంగారు భవిష్యత్తు ఉన్న ఆ చిన్నారి పట్ల దేవుడు కనికరం చూపించలేదు. వివరాల్లోకి వెళితే.. రాజన్న సిరిసిల్ల జిల్లా (Rajanna Sirisilla District) బోయినపల్లి (Boinapally) మండల పరిధిలోని మల్లాపూర్ (Mallapur) గ్రామానికి చెందిన ఆకుల నాగచైతన్య (15) అనే బాలిక అదే గ్రామంలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల (Government High School)లో చదువుతుంది. అయితే, ఏప్రిల్ 17న నాగచైతన్య (Naga Chaithanya) తీవ్ర అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయింది.
గురువారం మధ్యాహ్నం హైదరాబాద్ (Hyderabad)లోని రవీంద్ర భారతి (Ravindra Bharati)లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పది ఫలితాలను విడుదల చేశారు. ఈ క్రమంలోనే మల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల ఫలితాలను చెక్ చేస్తుండగా.. చనిపోయిన నాగచైతన్య వంతు వచ్చింది. దీంతో ఆమె హాల్‌టికెట్ నెంబర్‌ను వెబ్‌సెట్ చెక్ చేయగా.. అక్కడున్న వచ్చిన మార్కులు చూసి షాక్ అయ్యారు. ఏకంగా నాగ చైతన్య 510 మార్కులతో ఏకంగా స్కూల్ ఫస్ట్ వచ్చింది. ఇదే విషయాన్ని ఉపాధ్యాయులు, బాలిక తల్లిదండ్రులకు తెలుపగా.. వారు పాఠశాలకు వద్దకు వచ్చి తమ కుతూరుని తలుచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వారి అరణ్య రోదన చూసిన అక్కడున్న వారు సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.






