Breaking: నిడదవోలులో వింత ఘటన.. నిజమైన బ్రహ్మంగారి కాలజ్ఞానం

by Indraja |

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం లోని కంసాలిపాలెం గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది.

Breaking: నిడదవోలులో వింత ఘటన.. నిజమైన బ్రహ్మంగారి కాలజ్ఞానం
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం లోని కంసాలిపాలెం గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. వేప చెట్టు నుండి ఏకధాటిగా పాలు కారుతున్నాయి. ఈ వింత ఘటనను చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అలానే వేప చెట్టుకి పాలు కారడడం దేవుని మహిమ అని నమ్మి పసుపు, కుంకుమ, కొబ్బరి కాయలతో ఆ చెట్టుని పూజిస్తున్నారు.

ఇక ఈ అద్భుత ఘటన గురించి ఆ ఊరి ప్రజలు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కంసాలిపాలెం గ్రామం లోని చెరువు గట్టు పైన ఉన్న వేప చెట్టుకు పాలు కారడం నిన్న ఉదయం ఆరు గంటకు గమనించినట్లు పేర్కొన్నారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైందని తాము నమ్ముతున్నట్లు తెలిపారు. అలానే వేప చెట్టునుండి పాలధార ఏకధాటిగా కారుతూనే ఉందని తెలిపారు.

ఇక నిన్న రథసప్తమి కావడం.. రథసప్తమి రోజే ఈ అద్భుతం చోటు చేసుకోవడం శుభసూచికంగా భావిస్తున్నామని వెల్లడించారు. ఈ నేపధ్యం లో ఈ వింత ఘటన గురించి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా తెలియ చేశామని.. దీనితో చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా ప్రజలు తరలి వచ్చి ఆ చెట్టుకి పూజలు చేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు.

Next Story