VIDEO: అర్ధరాత్రి కారుకు అడ్డంగా వచ్చిన వింతజీవి.. షాకింగ్ వీడియో వైరల్!

by Ajay Maddhiboyina |

తెల్లవారుజామున కారులో వెళుతున్న ఊబర్ డ్రైవర్‌కు ఊహించని ఘటన ఎదురైంది. కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా అడ్డంగా ఓ వింతజీవి వచ్చి నిలుచుంది. ఆ జీవి వింతగా ప్రవర్తించడంతో డ్రైవర్ అవాక్కై అక్కడే ఆగిపోయాడు.

VIDEO: అర్ధరాత్రి కారుకు అడ్డంగా వచ్చిన వింతజీవి.. షాకింగ్ వీడియో వైరల్!
X

దిశ‌, వెబ్ డెస్క్: తెల్లవారుజామున కారులో వెళుతున్న ఊబర్ డ్రైవర్‌కు ఊహించని ఘటన ఎదురైంది. కారులో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా అడ్డంగా ఓ వింతజీవి వచ్చి నిలుచుంది. ఆ జీవి వింతగా ప్రవర్తించడంతో డ్రైవర్ అవాక్కై అక్కడే ఆగిపోయాడు. చూడ్డానికి మనిషిలాగే కపిస్తున్న దానికి వెనకాల తోక ఉండటం, కోతిలా ప్రవర్తించడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ ఘటన అమెరికాలో జరిగినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండగా నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.

అయితే వీడియోపై క్లారిటీ లేకపోవడంతో అది జంతువా లేదంటే మనిషా అని తెలుసుకునేందుకు నెటిజన్లు సైతం తలలు పట్టుకుంటున్నారు. మరోవైపు ఏఐ క్రియేటెడ్ వీడియో అని సైతం అనుమానిస్తున్నారు. కొంతమంది ఏఐతో ఇలాంటి వీడియోలు క్రియేట్ చేస్తూ వైరల్ చేస్తున్నారని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక వీడియోలో తేదీ చూస్తే నిన్న జరిగినట్టు కనిపిస్తోంది. సెప్టెంబర్ 30, 2025 అనే తేదీ వీడియోలో కనిపిస్తుంది. VIDEO

Next Story