- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అరుదైన దృశ్యం.. వివిధ జాతి పులుల మధ్య ప్రేమ.. వైరల్ వీడియో చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది!
పులులు.. ఫాంథెరా జాతికి చెందిన అతి పెద్ద పిల్లులు.

దిశ, వెబ్ డెస్క్: పులులు.. ఫాంథెరా జాతికి చెందిన అతి పెద్ద పిల్లులు. ఇక ఇందులో చిరుతలు, బెంగాల్ టైగర్లు, తెల్ల పులులు, మంచు చిరుతలు, తెల్ల సింహాలు.. ఇలా రకరకాలుంటాయి. ఇవి భయాంకరమైన వన్య ప్రాణులని మనకు తెలిసిన నిజ జీవితంలో చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటాం. అందుకోసం జూ పార్కులకు, జంగీల్ సఫారీలకు వెళ్తుంటాం. కానీ ఇందులో అన్నింటికి ఒకేసారి ఒకే చోట చూసేందుకు వీలుపడదు. కారణం.. ఇవన్నీ వివిధ భౌగోళిక పరిసరాల్లో జీవిస్తుంటాయి. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన ఓ అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫాంథెరా జాతి పెద్ద పిల్లులన్నీ ఒకే చోట సందడి చేస్తున్నాయి. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ గడ్డి మైదానంలో చిరుత (Leopard), బెంగాల్ టైగర్ (Bengal Tiger), తెల్ల పులి (White Tiger), తెల్ల సింహం, మంచు చిరుత అన్ని కలిసి సరదాగా ఆడుకుంటూ గడుపుతున్నాయి. సాధారణంగా ఇవన్నీ ఉగ్రంగా కనిపిస్తాయి. కానీ, వీడియోలో మాత్రం ఒకరిపై మరొకరు తలవాల్చుకుని కనిపించాయి. వేర్వేరు ప్రాంతాల్లో నివసించే ఈ జంతువులు అన్ని ఒకే చోట ఉండటం నెటిజన్ల మనసులను దోచుకుంటోంది. ఇవన్నీ ఒకే ప్రదేశంలో ప్రశాంతంగా కలిసి ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే, ఈ వీడియో ఎక్కడ తీసిందో తెలియలేదు. కానీ ఇప్పటికే మిలియన్ల వ్యూస్, లక్షల లైక్స్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు 'ఇది నిజమైన అనుబంధం', 'అన్ని ఒక కుటుంబంలా కలిసిపోయాయి', 'వావ్.. అద్భుత దృశ్యం' అంటూ కామెంట్లు పెడుతున్నారు.






