బాలింతపై పోలీస్ అధికారి దాడి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వైరల్

by Ramesh Naini |   (  Updated:2025-12-20 15:31:26  IST  )

కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌లో బాలింతపై పోలీస్ అధికారి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బాలింతపై పోలీస్ అధికారి దాడి.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేరళ రాష్ట్రం కొచ్చిలోని ఎర్నాకుళం నార్త్ పోలీస్ స్టేషన్‌లో బాలింతపై పోలీస్ అధికారి దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో)గా పనిచేసిన ప్రథాప్ చంద్రన్ (PrathapChandran) బాలింత అయిన శైమోల్ ఎన్.జే (Shymol)ను తోసి, చెంపదెబ్బ కొట్టిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపించడంతో అధికార యంత్రాంగం చర్యలకు దిగింది. ఘటనకు సంబంధించి సంబంధిత అధికారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన గత ఏడాది జూన్ 18, 2024న చోటు చేసుకున్నప్పటికీ, దాదాపు ఏడాది పాటు సాగిన న్యాయపోరాటం అనంతరం సీసీటీవీ దృశ్యాలు బయటకు వచ్చాయి. శైమోల్ హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఫుటేజ్ ఆమెకు అందింది.

వివరాల ప్రకారం.. బాలింత శైమోల్ భర్త బెన్ జోను రైల్వే స్టేషన్ సమీపంలోని తమ పర్యాటక వసతి కేంద్రం వద్ద ఇద్దరు దొంగతన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలను చిత్రీకరించాడని కారణంతో భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని ఆరోపణలతో ఆయనను కేసులో మూడో నిందితుడిగా చేర్చారు.

భర్తను అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న శైమోల్ విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా, అక్కడ ఎస్‌హెచ్‌వోతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సమయంలో అధికారి ఆమెను తోసి, అనంతరం చెంపదెబ్బ కొట్టినట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. తన గర్భధారణ విషయం పలుమార్లు పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని శైమోల్, ఆమె భర్త ఆరోపించారు. ఈ విషయం కేరళ సీఎం పినరయి విజయన్, అలాగే స్టేట్ డీజీపీ చంద్రశేఖర్ వరకు చేరింది. ఈ క్రమంలోనే పోలీస్ అధికారిపై చివరకు చర్యలు తీసుకున్నారు. వీడియో ఇదే..

Next Story