Viral Video : కోతికి కొబ్బరి చిప్పకాదు, డబ్బులు దొరికితే ఏం చేస్తుందో తెలుసా..?!

by Javid Pasha |   (  Updated:2025-06-17 06:57:52  IST  )

Viral Video : కోతికి కొబ్బరి చిప్పకాదు, డబ్బులు దొరికితే ఏం చేస్తుందో తెలుసా..?!

Viral Video : కోతికి కొబ్బరి చిప్పకాదు, డబ్బులు దొరికితే ఏం చేస్తుందో తెలుసా..?!
X

దిశ, ఫీచర్స్ : కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు.. అనే మాట వీరు వినే ఉంటారు. ఎవరైనా పిల్లలు, ఇతర పిల్లల చేతుల్లోంచి తినుబండారాలు లాక్కొని తినడం, తీసుకొని పారిపోవడం వంటివి చేస్తున్న సందర్భాల్లో ఇలా అభివర్ణిస్తుంటారు. మొత్తానికి కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే కానీ.. అదే కోతికి డబ్బులు దొరికితే.. ఏం చేస్తుందో తెలుసా? అందుకు సంబంధించిన వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ గుహల (Guna Caves) సమీప ప్రాంతం. వీటిని చూడటానికి తరచుగా పర్యాటకులు వస్తుంటారు. మరో విషయం ఏంటంటే.. ఇక్కడ కోతులు సంఖ్య కూడా ఎక్కువే. వచ్చీ పోయే టూరిస్టులు అప్పుడప్పుడూ వాటికి పండ్లు, బిస్కెట్లు, ఇతర తినుబండరాలు వంటివి ఇస్తుంటారు. ఇక ఆహారం దొరకనప్పుడు టూరిస్టుల చేతుల్లో కనిపించిన పండ్లు, పదార్థాలను లాక్కొని పారిపోతుంటాయి. అయితే తాజాగా ఒక కోతి టూరిస్టు ఒక టూరిస్టు చేతిలోంచి రూ.500 నోట్ల కట్టను లాక్కెళ్లింది. కోతి చేతికి కొబ్బిరి చిప్ప దొరికినా, డబ్బు దొరికినా తోచినట్లు చేయడమే దాని సహజ గుణం అంటారు కదా.. ఇక్కడా అదే కొంటె పని చేసింది. లాక్కెళ్లిన డబ్బులను చెట్టుపైకి తీసుకెళ్లి ఒక్కొక్క నోటును తీస్తూ, చించుతూ కిందకు విసిరేస్తూ ఉంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తుండగా.. కోతుల బెడద ఎక్కువైపోతోందని కూడా కొందరు పేర్కొంటున్నారు.

Monkey viral video link

Next Story